IPPB:ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌లో జాబ్స్..30 వేల వరకు జీతం!

ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే చాలదు.. దానికి సరైన ప్రణాళిక డెడికేషన్ ఉండాలి. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా నోటిఫికేష్ విడుదల చేసింది.

ఉద్యోగం సాధించాలనే తపన ఉంటే చాలదు.. దానికి సరైన ప్రణాళిక డెడికేషన్ ఉండాలి. ఇటీవల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీ స్థాయిలో ఉద్యోగాల భర్తీకోసం నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. తాజాగా ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ కూడా నోటిఫికేష్ విడుదల చేసింది.

చాలా మంది యువతకు ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించాలనే కోరిక ఉంటుంది. అందుకే రేయింబవళ్లు కష్టపడి చదువుతుంటారు. ఈ క్రమంలో కొందరు సర్కార్ కొలువులు సంపాదించగా, మరికొందరు కొన్ని మార్కుల తేడాతో ఉద్యోగాన్ని కోల్పోతుంటారు. అయితే ఇదే సమయంలో తరచూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తుంటారు. ప్రభుత్వాలు, బ్యాంకులు కూడా తమ సంస్థలో ఖాళీ అయిన పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ లు విడుదల చేస్తుంటాయి. తాజాగా ఇండియాపోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ లో ఉద్యోగాలకు నోటిఫికేష్ విడుదలైంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ రంగ సంస్థలో అతి ప్రధానమైన వాటిల్లో ఇండియా పోస్ట్ పేమెంట్స్ ఒకటి. అనేక రకాల సేవలను తన వినియోగాదారులకు అందిస్తోంది. తాజాగా ఈ బ్యాంక్ నుంచి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇండియా పోస్ట్ పేమెంట్స్  బ్యాంక్ లు అనేకం ఉన్నాయి. వీటిల్లో కాంట్రాక్ ప్రాతిపదికన ఉద్యోగాలకు నోటిఫికేషన్ సదరు సంస్థ విడుదల చేసింది. అయితే ఈ పోస్టులకు అప్లయ్ చేసే వారు ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు అనేది ఆన్ లైన్ విధానంలో ఉంటుంది.

అర్హులైన వారు ఆన్ లైన్ విధానంలో మాత్రమే అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎగ్జామ్ విషయానికి వస్తే…ఆన్ లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్య్వూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి నెలకు 30వేల రూపాయల జీతం ఉంటుంది. ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకునేందుకు 2024 ఏప్రిల్ 5, 2024 చివరి తేదిగా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం  https://www.ippbonline.com/  ఈ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

నోటిఫికేషన్ లోని ఇతర వివరాలు చూసినట్లు అయితే మొత్తం 47 ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉన్నాయి. ఏదైనా సబ్జెట్ ప్రధానంగా ఉండి.. గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఆఫ్ లైన్ లో దరఖాస్తు కు అవకాశం లేదు. కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే అర్హులైన వారు అప్లయ్ చేసుకోవచ్చు. అలానే 2024 మార్చి 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉన్నవారే ఈ పోస్టులకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 వరకు వేతనం వస్తుంది.ఈ పోస్టులకు ఆన్‌లైన్ టెస్ట్/ గ్రూప్ డిస్కషన్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది జాబితా ఎంపిక అనేది జరుగుతోంది. ఈ పోస్టులకు అప్లయ్ చేయాలనుకునే జనరల్ అభ్యర్థులకు రూ.750, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు మాత్రం రూ.150 ఫీజుగా నిర్ణయించారు. ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే అప్లయ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులకు 2024 ఏప్రిల్‌ 5 చివరితేది. పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.

Show comments