డిగ్రీ పాసైతే చాలు.. 8 వేల బ్యాంకు ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్

డిగ్రీ పాసైతే చాలు.. 8 వేల బ్యాంకు ఉద్యోగాలు.. ఇక వద్దన్నా జాబ్

మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 8 వేల బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నది. బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యమైతే అస్సలు వదలకండి.

మీరు డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. 8 వేల బ్యాంకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడనున్నది. బ్యాంకు ఉద్యోగమే మీ లక్ష్యమైతే అస్సలు వదలకండి.

బ్యాంకు ఉద్యోగాలకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. యువత బ్యాంకు ఉద్యోగాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. బ్యాంకు ఉద్యోగమైతే మంచి జీతం, ఆహ్లాదకరమైన వాతావరణంలో విధులు, సెలవులు కూడా అధికంగా ఉండడంతో బ్యాంకు ఉద్యోగాలకు క్రేజ్ ఎక్కువ. యువత ఏళ్ల తరబడి బ్యాంకు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతుంటారు. మరి మీరు కూడా డిగ్రీ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? త్వరలోనే 8 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ త్వరలో ప్రొబెషనరీ ఆఫీసర్స్, క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను రిలీజ్ చేయనున్నది.

ఐబీపీఎస్ బ్యాంకు ఉద్యోగాల భర్తీకోసం ఈ వారంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో కామన్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ ద్వారా రిక్రూట్‌మెంట్ జరుగుతుంది. ఐబీపీఎస్, నాబార్డ్ సాయంతో నోడల్ రీజినల్ కింద ఆఫీస్ అసిస్టెంట్(క్లర్క్), ఆఫీసర్ స్కేల్ (అసిస్టెంట్ మేనేజర్), ఆఫీసర్ స్కేల్ 2 (మేనేజర్) , ఆఫీస్ స్కేల్ 3 (సీనియర్ మేనేజర్) పోస్టుల కోసం ఖాళీలు భర్తీ చేయబడతాయి. ప్రిలిమ్స్ , మెయిన్స్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను క్లర్క్ పోస్టుకు ఎంపిక చేస్తారు. అయితే పీఓ పోస్టుకు ఎంపిక ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది. ఆఫీసర్ గ్రేడ్ 3 పోస్టుకు సింగిల్ లెవల్ పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.

ప్రొబెషనరీ ఆఫీసర్, క్లర్క్ పోస్టులకు ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టులో జరుగనున్న నేపథ్యంలో త్వరలోనే ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. క్లర్క్ పోస్టుల కోసం పోటీపడే అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ప్రొబెషనరీ ఆఫీసర్ పోస్టుల కోసం (అసిస్టెంట్ మేనేజర్) గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా దాని సమానమైన డిగ్రీ కలిగి ఉండాలి. స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్, ఆర్ఆర్బీ పీవో) ఆఫీస్ అసిస్టెంట్లు, ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ పరీక్షలు ఆగస్టు 3, 5, 10, 17, 18 తేదీల్లో జరగనున్నాయి. ముందుగా ఈ పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.

Show comments