BTech చేసిన కుర్రోళ్ళకి గుడ్ న్యూస్! ఎగ్జామ్ లేకుండానే 55 వేల జీతంతో జాబ్!

ECIL Recruitment 2024: బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

ECIL Recruitment 2024: బీటెక్ గ్రాడ్యుయేట్స్ కి గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష లేకుండానే ఈ ఉద్యోగాలను పొందొచ్చు.

మీరు బీటెక్ చేసి ఖాళీగా ఉన్నారా? బీటెక్ అర్హతతో ఉద్యోగాల కోసం సెర్చ్ చేస్తున్నారా? అయితే బీటెక్ గ్రాడ్యుయేట్స్ కు అదిరిపోయే గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పలు ఉద్యోగాల భర్తీ కోసం జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేదు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 55 వేల జీతం అందుకోవచ్చు. ప్రైవేట్ సెక్టార్ కంటే ప్రభుత్వ ఉద్యోగాలకే ప్రియారిటీ ఇచ్చే వారికి ఇవి బెస్ట్ జాబ్స్. ప్రైవేట్ లో అయితే జాబ్ సెక్యూరిటీ ఉండదు. ఒత్తిడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు.

ఎలక్ట్రానిక్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) హైదరాబాద్ తో పాటు పలు జోనల్ కార్యాలయాల్లో ఒప్పంద ప్రాతిపదికన పలు ఉద్యోగాలను భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈజీగా జాబ్ సాధించొచ్చు. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 115 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చయనున్నారు. అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. పోస్టులను అనుసరించి 30 నుంచి 33 ఏళ్లు కలిగి ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవాళ్లు ఆగస్టు 8 వరకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు: 115

విభాగాల వారీగా ఖాళీలు:

  • ప్రాజెక్ట్ ఇంజినీర్: 20
  • టెక్నికల్ ఆఫీసర్: 53
  • జూనియర్ టెక్నీషియన్: 42

అర్హత:

  • సంబంధిత విభాగంలో ఐటీఐ, బీఈ/బీటెక్ ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 30 నుంచి 33 ఏళ్లు కలిగి ఉండాలి. ఆయా కేటగిరీ వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి.

ఎంపిక విధానం:

  • విద్యార్హత మార్కులు, ఇంటర్య్వూ, పని అనుభవం, మెరిట్ లిస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టులకు 40 వేల నుంచి 55 వేలు, టెక్నికల్ ఆఫీసర్ కు 25 వేల నుంచి 31 వేలు, జూనియర్ టెక్నీషియన్ కు 22528-27258 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

  • 08-08-2024
Show comments