AIASL Recruitment 2024: డిగ్రీ పాసైతే చాలు.. ఎయిర్ పోర్టులో 1,049 ఉద్యోగాలు రెడీ.. నెలకు 28 వేల జీతం

డిగ్రీ పాసైతే చాలు.. ఎయిర్ పోర్టులో 1,049 ఉద్యోగాలు రెడీ.. నెలకు 28 వేల జీతం

AIASL Recruitment 2024: మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

AIASL Recruitment 2024: మీరు డిగ్రీ పాసై ఖాళీగా ఉన్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

ప్రతీ సంవత్సరం వేలాది మంది డిగ్రీ పట్టాభద్రులవుతున్నారు. దీంతో ఉద్యోగాలకు కాంపిటీషన్ ఎక్కువైపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు సాధించాలంటే.. స్పెషల్ కోర్సులు, స్కిల్స్ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోటీపరీక్షల్లో ప్రతిభ చూపాల్సి ఉంటుంది. ఇలా అన్ని దశలను దాటితేనే తప్పా ఉద్యోగం సొంతం కాదు. ఇలాంటి తరుణంలో మీకు డిగ్రీ అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగం పొందే అవకాశం వచ్చింది. ఈ ఉద్యోగాలకు రాతపరీక్ష లేదు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. ఈ అవకాశాన్ని వదులుకోకండి.

ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 1,049 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్ ద్వారా జులై 14 వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. పోస్టులను అనుసరించి 28-33 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య: 1049

విభాగాల వారీగా ఖాళీలు:

సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 343

కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్: 706

అర్హత:

  • ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విభాగంలో 5 సంవత్సరాల అనుభవం ఉండాలి. ఇంగ్లిష్, హిందీ బాషలపై మంచి పట్టు ఉండాలి.

వయోపరిమితి:

  • పోస్టులను అనుసరించి 28-33 ఏళ్ల వయసు కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

  • దరఖాస్తుల షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • సీనియర్ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.28,605, కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు రూ.27,450 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్ పోస్టులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌లైన్

దరఖాస్తుకు చివరితేదీ:

  • 14-07-2024

చిరునామా:

  • The Incharge, HR Department
    AI AIRPORT SERVICES LIMITED
    (Formerly known as AIR INDIA AIR TRANSPORT SERVICES LTD.)
    CSMI Airport, Sahar, Mumbai 400099.
Show comments