AP డీఎంఈలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఆశావాహులకు శుభవార్త. ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే ఆశావాహులకు శుభవార్త. ఏపీ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాలు మీకోసం..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుస నోటిఫికేషన్లు విడుదల చేస్తూ నిరుద్యోగులకు శుభవార్తను అందిస్తోంది. ఎప్పటి నుంచో ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యేవారికి ఉద్యోగాల భర్తీ వరంగా మారింది. ప్రభుత్వ ఉద్యోగం సాధించి జీవితంలో ఉన్నత స్థితిలో స్థిరపడాలనుకునే వారికి ఇదొక సువర్ణావకాశం. ఇప్పటికే గ్రూప్ 2, గ్రూప్ 1 వేరే ఇతర శాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం జగన్ సర్కార్ నోటిఫికేషన్లను విడుదల చేసింది. వాటన్నింటికి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏపీ గవర్నమెంట్ నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ అందించింది. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

మీరు వైద్య విద్యలో పీజీ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే మీకిది పండగలాంటి వార్త. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్ మెంట్ బోర్డు ఆధ్యర్యంలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 170 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీచేయనున్నారు. వాక్‌ఇన్ రిక్రూట్మెంట్ ద్వారా డైరెక్ట్ /లాటరల్ /కాంట్రాక్టు పద్ధతిలో ఖాళీల భర్తీ చేపట్టనున్నారు.

ఇందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, టీచింగ్ ఆసుపత్రుల్లో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 144 పోస్టుల్ని శాశ్వత ప్రాతిపదికన (డైరెక్ట్/లేటరల్) భర్తీ చేయనున్నారు. అదేవిధంగా విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నంలో వివిధ స్పెషాలిటీలలో ఖాళీగా ఉన్న 26 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ కోసం డిసెంబరు 15న విశాఖపట్నంలో వాక్‌ఇన్ నిర్వహించనున్నారు. దరఖాస్తు చేసుకోదలచిన అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఏపీ డీఎంఈ అధికారిక వెబ్ సైట్ https://dme.ap.nic.in. ను పరిశీలించగలరు.

ముఖ్యమైన సమాచారం:

పోస్టుల వివరాలు:

  • అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు

మొత్తం పోస్టులు:

  • 170

ప్రభుత్వ మెడికల్ కాలేజీలు:

  • 144 పోస్టులు

వాకిన్ ఇంటర్య్వూ తేదీలు:

  • 18-12-2023, 20-12-2023.

వాక్ఇన్ వేదిక:

  • అభ్యర్థులు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఓల్డ్ జీజీహెచ్ క్యాంపస్, హనుమాన్ పేట, విజయవాడలో హాజరు కావాల్సి ఉంటుంది.

విశాఖ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(విమ్స్) విశాఖపట్నం:

మొత్తం పోస్టులు:

  • 26

వాకిన్ ఇంటర్య్వూ తేది:

  • 15-12-2023.

వాక్ఇన్ వేదిక:

  • విమ్స్, హనుమంతవాక జంక్షన్ విశాఖపట్నం.

అర్హత:

  • సంబంధిత సబ్జెక్టులో పీజీ డిగ్రీ (ఎండీ/ఎంఎస్/డీఎన్బీ/డీఎం) ఉత్తీర్ణతోపాటు సీనియర్ రెసిడెంట్‌గా(సీనియర్ రెసిడెన్సీ) ఏడాది అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

  • ఓసీ అభ్యర్థులు నోటిఫికేషన్ తేదీ నాటికి 42 సంవత్సరాలు లోపు ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్య్లూఎస్ అభ్యర్థులు 47 సంవత్సరాల లోపు ఉండాలి.
  • దివ్యాంగులు 52 సంవత్సరాల లోపు ఉండాలి.
  • ఎక్స్ సర్వీస్ మెన్స్ 50 సంవత్సరాల లోపు ఉండాలి.

ఎంపిక విధానం:

  • మెరిట్ లిస్ట్, డాక్యుమెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • ఓసీ అభ్యర్థులు రూ. 1000 చెల్లించాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఈడబ్య్లూఎస్, పీహెచ్ అభ్యర్థులు రూ. 500 చెల్లించాలి.

ఏపీ డీఎంఈ అధికారిక వెబ్ సైట్:

https://dme.ap.nic.in.

Show comments