మంచి ఛాన్స్.. 10th పాసైతే చాలు.. మంచి జీతంతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాలు

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. పదో తరగతి అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి ఛాన్స్. పదో తరగతి అర్హతతో ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. వెంటనే అప్లై చేసుకోండి.

డిగ్రీలు, పీజీ పట్టాలు చేత పట్టుకుని ఉద్యోగాల కోసం వెతుకుతున్నవారు ఎంతో మంది ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కాంపిటీషన్ హెవీగా ఉంది. ఏ చిన్న నోటిఫికేషన్ రిలీజ్ అయినా కూడా లక్షలాది మంది పోటీపడుతున్నారు. మరి ఇంతటీ కాంపిటీషన్ లో ఉద్యోగం సాధించడమంటే మామూలు విషయం కాదు. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే మీకు ఓ గుడ్ న్యూస్. ఎయిర్ పోర్టులో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు పదోతరగతి పాసైతే చాలు. టెన్త్ అర్హతతోనే ఎయిర్ పోర్టులో ఉద్యోగం పొందే అవకాశాన్ని అస్సలు వదులుకోకండి.

న్యూఢిల్లీలోని ఏఐ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన హ్యాండీమ్యాన్, యుటిలిటీ ఏజెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 422 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం, వ్యాలిడ్‌ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు మే 2 నుంచి 4వ తేదీ వరకు వాక్-ఇన్‌కి హాజరు కావాల్సి ఉంటుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

  • 422

విభాగాల వారీగా ఖాళీలు:

యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్:

  • 130

హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్:

  • 292

అర్హత:

  • హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు ఇంగ్లిష్/ హిందీ భాషల్లో పరిజ్ఞానం ఉండాలి. యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకు పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు వ్యాలిడ్‌ హెచ్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి.

వయోపరిమితి:

  • జనరల్ అభ్యర్థులకు 28 సంవత్సరాలు, ఓబీసీలకు 31 సంవత్సరాలు, ఎస్సీ/ ఎస్టీలకు 33 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక విధానం:

  • పోస్టులను అనుసరించి ట్రేడ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

  • నెలకు యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టుకు రూ.24,960. హ్యాండీమ్యాన్/ హ్యాండీ ఉమెన్ పోస్టుకు రూ.22,530.

వాక్-ఇన్ తేదీలు:

  • 02-05-2024, 04-05-2024.

వేదిక:

ఆఫీస్ ఆఫ్ ది హెచ్ఆర్డీ డిపార్ట్ మెంట్,
ఏఐ యూనిటి కాంప్లెక్స్, పల్లవరం కంటోన్మెంట్,
చెన్నై-600043,

ల్యాండ్ మార్క్ : తాజ్ క్యాటెరింగ్

Show comments