Virat Kohli: కోహ్లీని కావాలనే టార్గెట్ చేస్తున్నారు.. పాక్ లెజెండ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. అయినా అతడిపై విమర్శలు తప్పడం లేదు. ఈ విషయంపై ఓ పాక్ లెజెండ్ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. అయినా అతడిపై విమర్శలు తప్పడం లేదు. ఈ విషయంపై ఓ పాక్ లెజెండ్ రియాక్ట్ అయ్యాడు.

ఐపీఎల్-2024లో బ్యాట్​తో దుమ్మురేపుతున్నాడు విరాట్ కోహ్లీ. ఇప్పటిదాకా ఆడిన 11 మ్యాచుల్లో కలిపి ఏకంగా 542 పరుగులు చేశాడు. అతడి యావరేజ్ 67గా ఉంది. దీన్ని బట్టే కింగ్ బ్యాట్ ఏ రేంజ్​లో గర్జిస్తోందో అర్థం చేసుకోవచ్చు. ఆర్సీబీని గెలిపించేందుకు తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడీ స్టార్ బ్యాటర్. టీ20 వరల్డ్ కప్-2024కు ముందు కోహ్లీ ఫుల్ ఫామ్​లోకి రావడం టీమిండియాకు అదిరిపోయే న్యూస్ అనే చెప్పాలి. పొట్టి కప్పులోనూ విరాట్ ఇలాగే ఆడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఐపీఎల్​లో కోహ్లీ స్ట్రైక్ రేట్ అంశం వివాదాస్పదంగా మారింది. సన్​రైజర్స్​ హైదరాబాద్​తో జరిగిన మ్యాచ్​లో అతడి స్ట్రైక్ రేట్ 118గా ఉండటంతో అతడిపై భారీగా విమర్శలు వచ్చాయి.

ఓపెనర్​గా వస్తున్న కోహ్లీ ఆఖరి వరకు బ్యాటింగ్ చేస్తున్నాడు. అలాంటోడి స్ట్రైక్ రేట్ 118గా ఉండటంతో భారత దిగ్గజం సునీల్ గవాస్కర్ సహా పలువురు సీనియర్లు సీరియస్ అవుతున్నారు. ఇంత స్లోగా ఆడటం కరెక్ట్ కాదని.. స్పిన్నర్లను కూడా విరాట్ సరిగ్గా ఎదుర్కోవడం లేదని అంటున్నారు. టీ20 వరల్డ్ కప్​లోనూ ఇలాగే ఆడితే ఇంక భారత్ కప్పు కొట్టినట్టేనని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఈ విషయంపై పాకిస్థాన్ లెజెండ్ వసీం అక్రమ్ రియాక్ట్ అయ్యాడు. కోహ్లీని కొందరు కావాలనే టార్గెట్ చేస్తున్నారని అక్రమ్ అన్నాడు. ఇంత బాగా ఆడుతున్నప్పటికీ కింగ్​ను లక్ష్యంగా చేసుకొని సూటిపోటి వ్యాఖ్యలు చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు.

‘సెంచరీ చేసిన మ్యాచ్​లో కోహ్లీ స్ట్రైక్ రేట్ 150గా ఉంది. ఇది సరిపోదా? ఇంకా వేగంగా పరుగులు చేయాలా? విరాట్ ఈ స్ట్రైక్ రేట్​తో పరుగులు చేస్తున్నప్పుడు, అతడి టీమ్ విజయాలు సాధిస్తున్నప్పుడు విమర్శలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదు. అతడి మీద బురద చల్లుతున్న వాళ్లంతా ఒకటి అర్థం చేసుకోవాలి. క్రికెట్ అనేది 11 మంది సమష్టిగా ఆడే ఆట. ఇక్కడ ఒక్క ప్లేయర్ బాగా ఆడితే సరిపోదు. ఒక్కడే మ్యాచ్​లు గెలిపించలేడు. విరాట్ కెప్టెన్​గా ఉన్నప్పుడూ ఒత్తిడిలోనే ఉన్నాడు. ఇప్పుడు కూడా అతడి మీద ప్రెజర్ ఆ లెవల్​లోనే ఉంది. అతడు బాగానే ఆడుతున్నాడు. అతడ్ని అనవసరంగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేస్తున్నారు’ అంటూ అక్రమ్ దుయ్యబట్టాడు. మరి.. కోహ్లీని సమర్థిస్తూ అక్రమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

Show comments