Sanju Samson: సంజూ ఫ్యాన్స్​కు అదిరిపోయే న్యూస్.. దీని కోసమే ఏళ్లుగా ఎదురుచూశారు!

సంజూ శాంసన్ అభిమానులకు ఇది అదిరిపోయే న్యూస్. ఏళ్లుగా ఎదురుచూస్తున్న అతడి ఫ్యాన్స్ గనుక​ ఇది వింటే పండుగ చేసుకుంటారు.

సంజూ శాంసన్ అభిమానులకు ఇది అదిరిపోయే న్యూస్. ఏళ్లుగా ఎదురుచూస్తున్న అతడి ఫ్యాన్స్ గనుక​ ఇది వింటే పండుగ చేసుకుంటారు.

సంజూ శాంసన్.. క్రికెట్ అభిమానులకు పరిచయం అక్కర్లేని పేరు. 9 ఏళ్ల కిందే ఇంటర్నేషనల్ క్రికెట్​లో అడుగుపెట్టాడీ కేరళ బ్యాటర్. అయితే కెరీర్ మొదట్లో అంతగా అవకాశాలు రాలేదు. టీమ్​తో ట్రావెల్ అయినా అరకొర ఛాన్సులే దక్కాయి. వచ్చిన కొన్నింటినీ అతడు కంప్లీట్​గా యూజ్ చేసుకోలేదు. దీంతో మధ్యలో కొన్నిసార్లు టీమ్​లోకి వచ్చినా పూర్తిగా సెటిల్ కాలేకపోయాడు. ఎప్పుడు జట్టులో ఉంటాడో? ఎప్పుడు తీసేస్తారో? చెప్పలేని పరిస్థితి. అయితే ఇంటర్నేషనల్ కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఈ స్టైలిష్ బ్యాటర్.. ఐపీఎల్​లో మాత్రం దుమ్మురేపుతున్నాడు. వరుసగా అద్భుత ప్రదర్శనలతో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్​గానూ ప్రమోషన్ దక్కించుకున్నాడు. అయితే మొత్తానికి అతడి అభిమానుల ఎదురుచూపులకు ఫుల్​స్టాప్ పడే టైమ్ వచ్చేసింది.

భారత జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకోవడంతో పాటు వరల్డ్ కప్​లో దేశానికి ప్రాతినిధ్యం వహించాలనేది సంజూ కల. అయితే మొదటిది క్రమంగా సెట్ అవుతోంది. ఈ మధ్య టీమిండియా తరఫున అతడికి మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇక, ఈ ఐపీఎల్​లో బ్యాట్​తో చెలరేగడంతో రెండో కోరిక కూడా తీరడం కన్ఫర్మ్ అని అంటున్నారు. టీ20 వరల్డ్‌ కప్ జట్టులో సంజూ శాంసన్​కు చోటు ఖాయం అని క్రికెట్ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. అమెరికా-వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ప్రపంచ కప్​కు వెళ్లే భారత జట్టులో సంజూ ఉంటాడని అంటున్నారు. ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్​గా అతడ్ని తీసుకోవాలని సెలెక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దలు డిసైడ్ అయ్యారని టాక్ నడుస్తోంది.

రీఎంట్రీలో అదరగొడుతున్న రిషబ్ పంత్​తో పాటు పీక్ ఫామ్​లో ఉన్న దినేష్ కార్తీక్, ఫుల్ స్వింగ్​లో ఉన్న కేఎల్ రాహుల్ నుంచి తీవ్ర పోటీ ఎదురైనా సంజూను వికెట్ కీపర్ రోల్ వరించిందని తెలుస్తోంది. వరల్డ్ కప్ టీమ్​లో అతడే ఫస్ట్ ఛాయిస్ వికెట్ కీపర్ అని, ప్లేయింగ్ ఎలెవన్​లోనూ అతడు పక్కాగా ఉంటాడని చెబుతున్నారు. ఈ ఐపీఎల్​లో ఆడిన 9 మ్యాచుల్లో సంజూ 161 స్ట్రైక్ రేట్​తో 385 పరుగులు చేశాడు. కీపర్​గా, కెప్టెన్​గానూ సక్సెస్ అయ్యాడు. అతడి టాలెంట్, ఫిట్​నెస్, టెక్నిక్​, డిసిప్లిన్​కు ఫిదా అయిన సెలెక్టర్లు వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేశారని వినికిడి. దీంతో ఈ వార్త విన్న అతడి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్ల కల నెరవేరిందని, సంజూ అనుకున్నది సాధించాడని అంటున్నారు. అయితే సంజూ వరల్డ్ కప్ టికెట్ కన్ఫర్మేషన్ గురించి బీసీసీఐ నుంచి అధికారిక ప్రకనట వస్తే గానీ ఏదీ చెప్పలేం.

Show comments