Nidhan
ఐపీఎల్-2024లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డ్ చేరింది. ఇలా జరగడం ఇన్నేళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.
ఐపీఎల్-2024లో ఛాంపియన్‌గా ఆవిర్భవించింది కోల్‌కతా నైట్ రైడర్స్. అయితే కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఖాతాలో ఓ క్రేజీ రికార్డ్ చేరింది. ఇలా జరగడం ఇన్నేళ్ల లీగ్ చరిత్రలో ఇదే ఫస్ట్ టైమ్.
Nidhan
ఐపీఎల్-2024 ముగిసింది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్ ఫైట్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది కోల్‌కతా నైట్ రైడర్స్. ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల భారీ తేడాతో నెగ్గిన అయ్యర్ సేన కొత్త ఛాంపియన్‌గా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ముందు బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ ఓవర్లన్నీ ఆడలేకపోయింది. 18.3 ఓవర్లలో 113 పరుగులకు కుప్పకూలింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ 10.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కీలకమైన 2 వికెట్లు తీసి ఆరెంజ్ ఆర్మీ వెన్ను వెరిచిన మిచెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. టోర్నీ ఆసాంతం బ్యాట్, బాల్‌తో రఫ్ఫాడించిన సునీల్ నరైన్‌కు ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ పురస్కారం లభించింది. ఇక, కప్పు మిస్సైనా ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు.
ఐపీఎల్-2024 ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు కోహ్లీ. ఈ సీజన్లో 15 మ్యాచుల్లో 154 స్ట్రైక్ రేట్‌తో 741 పరుగులు చేశాడు విరాట్. ఇందులో ఓ సెంచరీ కూడా ఉంది. ఇన్నేళ్ల ఐపీఎల్ హిస్టరీలో రెండోసారి ఆరెంజ్ క్యాప్ అందుకున్న ఏకైక భారత ఆటగాడిగా విరాట్ చరిత్ర సృష్టించాడు. ఫైనల్ మ్యాచ్‌కు కోహ్లీ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో కేకేఆర్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆరెంజ్ క్యాప్‌ను అందుకున్నాడు. అవార్డు ప్రెజెంటేషన్ టైమ్‌లో కోహ్లీ పేరు చెప్పగానే స్టేడియంలోని అభిమానులు గట్టిగా అరిచారు. కోహ్లీ.. కోహ్లీ అంటూ నినాదాలతో హోరెత్తించారు. అయ్యర్ వచ్చి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాక కూడా విరాట్ నామస్మరణ ఆగలేదు. ఇది చూసిన నెటిజన్స్.. కోహ్లీ క్రేజ్‌కు ఇది నిదర్శనమని అంటున్నారు. అతడు స్టేడియంలో లేకున్నా ఫ్యాన్స్ చూపించిన ప్రేమ అపురూపమని చెబుతున్నారు.
ఇక, ఈ సీజన్లో ఆర్సీబీ జట్టు అదరగొట్టింది. టోర్నీ ఫస్టాఫ్‌లో వరుసగా ఆరు మ్యాచుల్లో ఓడి తీవ్రంగా నిరాశపర్చింది. దీంతో ఆ టీమ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ప్లేఆఫ్స్ సంగతి తర్వాత పాయింట్స్ టేబుల్లో లాస్ట్‌లో ఉండకపోతే అదే గొప్పని ఫిక్స్ అయ్యారు. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ డుప్లెసిస్ సేన అద్భుతంగా ఫైట్‌బ్యాక్ చేసింది. వరుసగా 6 మ్యాచుల్లో విజయాలు సాధించి దర్జాగా ప్లేఆఫ్స్ గడప తొక్కింది. నాకౌట్ మ్యాచ్‌లో సీఎస్కేకు పంచ్ ఇచ్చింది. దీంతో ఈసారి ఫైనల్స్‌కు వెళ్లి కప్ ఒడిసిపట్టడం పక్కా అని ఎక్స్పెక్టేషన్స్ ఏర్పడ్డాయి. అయితే ఎలిమినేటర్‌లో ఆర్సీబీ కథను ముగించింది రాజస్థాన్ రాయల్స్. దీంతో మరోసారి కప్పు మిస్సైందని ఆ టీమ్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు. అయితే ట్రోఫీ చేజారినా కోహ్లీకి ఆరెంజ్ క్యాప్ దక్కడం గుడ్ న్యూస్ అనే చెప్పాలి.