SRH రుణం తీర్చుకున్న యువరాజ్.. MIపై విధ్వంసానికి అతడే కారణం!

సన్​రైజర్స్ హైదరాబాద్ రుణం తీర్చుకున్నాడు లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్. ముంబై ఇండియన్స్ మీద ఎస్​ఆర్​హెచ్​ విధ్వంసంలో అతడిది కీలక పాత్ర.

సన్​రైజర్స్ హైదరాబాద్ రుణం తీర్చుకున్నాడు లెజెండరీ ఆల్​రౌండర్ యువరాజ్ సింగ్. ముంబై ఇండియన్స్ మీద ఎస్​ఆర్​హెచ్​ విధ్వంసంలో అతడిది కీలక పాత్ర.

ఐపీఎల్ చరిత్రలో మునుపెన్నడూ చూడని పరుగుల సునామీకి ఉప్పల్ స్టేడియం వేదికగా నిలిచింది. సన్​రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ మధ్య బుధవారం జరిగిన ఈ మ్యాచ్​ చివరి వరకు ఉత్కంఠగా సాగింది. రెండు జట్ల బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగడంతో మ్యాచ్​లో 500కి పైకి పరుగులు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్​ఆర్​హెచ్ ఓవర్లన్నీ ఆడి 3 వికెట్లకు 277 పరుగులు చేసింది. తద్వారా క్యాష్ రిచ్ లీగ్​ హిస్టరీలో అత్యధిక స్కోరు చేసిన టీమ్​గా నిలిచింది. ఆ తర్వాత ఛేజింగ్​కు దిగగిన హార్దిక్ సేన 246 పరుగులు చేసి.. విజయానికి 31 పరుగుల దూరంలో ఆగిపోయింది. ఈ విక్టరీతో ఐపీఎల్-2024లో సన్​రైజర్స్ బోణీ కొట్టింది. అయితే ఈ విజయంలో లెజెండ్ యువరాజ్ సింగ్ రోల్ కూడా ఉంది. ఎంఐపై ఎస్​ఆర్‌‌హెచ్ విధ్వంసానికి అతడు కూడా ఓ కారణమే.

సన్​రైజర్స్ రుణాన్ని తీర్చుకున్నాడు యువరాజ్ సింగ్. 2016లో ఈ ఫ్రాంచైజీకి ఆడాడు మాజీ ఆల్​రౌండర్. ఆ సీజన్ ఐపీఎల్ ట్రోఫీని ఎస్​ఆర్​హెచ్ దక్కించుకుంది. భారీ ధర పెట్టి తనను కొనుగోలు చేసి ఎంకరేజ్ చేసిన హైదరాబాద్​కు బాకీ పడ్డాడు యువీ. అయితే తాజాగా తన శిష్యుడి రూపంలో రుణాన్ని తీర్చుకున్నాడు. ఇప్పటికే టీమిండియాకు శుబ్​మన్ గిల్ రూపంలో ఓ అద్భుతమైన బ్యాటర్​ను తయారు చేసి ఇచ్చాడు యువీ. ఇప్పుడు అభిషేక్ శర్మను ఎస్​ఆర్​హెచ్​కు అందించాడు. ముంబై ఇండియన్స్​తో మ్యాచ్​లో ఈ యంగ్ బ్యాటర్ ఏ స్థాయిలో చెలరేగి ఆడాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 16 బంతుల్లో 50 పరుగుల మార్క్​ను చేరుకొని.. సన్​రైజర్స్ తరఫున ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ బాదిన ప్లేయర్​గా నిలిచాడు. మొత్తంగా 23 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 63 పరుగులు చేశాడు.

ముంబైపై తుఫానులా విరుచుకుపడిన అభిషేక్ శర్మ 3 బౌండరీలతో పాటు ఏకంగా 7 భారీ సిక్సులు బాదాడు. కొయెట్జీ, చావ్లా, ములానీ, మఫాకా.. ఇలా అందరి బౌలింగ్​ను ఉతికి ఆరేశాడు. సిక్సులు కొట్టడమే టార్గెట్​గా పెట్టుకొని ఒక్కొక్కరి బౌలింగ్​ను చీల్చి చెండాడాడు. అయితే ఒక టైమ్​లో బ్యాటింగ్​ టెక్నిక్​తో ఇబ్బంది పడ్డాడు అభిషేక్. అప్పుడు యువరాజ్ తనకు చాలా సాయం చేశాడని అన్నాడు. ‘నా బ్యాటింగ్​లో టెక్నికల్​గా ఏ సమస్య ఉన్నా యువరాజ్ దాన్ని పరిష్కరించేస్తాడు. ఆయనతో మాట్లాడిన ప్రతిసారి నాలో సరికొత్త ఎనర్జీ వస్తుంది. గ్రౌండ్​లోనే కాదు బయట కూడా బెటర్​గా సూచనలు చేస్తూ మెంటార్​గా నన్ను నడిపిస్తున్నాడు’ అని అభిషేక్‌ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు. దీన్ని బట్టే అతడి కెరీర్​లో యువీ రోల్ ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇక, ఎంఐపై అభిషేక్ ఆడిన తీరును మెచ్చుకుంటూ యువరాజ్ ఓ ట్వీట్ చేశాడు. అయితే బాగా ఆడావని ప్రశంసిస్తూనే.. చెత్త షాట్​ కొట్టి ఔట్ అయ్యావంటూ సీరియస్ అయ్యాడు. అభిషేక్ కెరీర్​లో యువీ పాత్ర గురించి తెలుసుకున్న నెటిజన్స్.. ఈ రకంగా ఎస్​ఆర్​హెచ్​కు అతడు సాయం చేస్తుండటం, రుణం తీర్చుకోవడం గొప్ప విషయమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments