ఆ బ్యాటర్​కు బౌలింగ్​ చేయాలంటే భయమేస్తోంది.. కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

సన్​రైజర్స్ నయా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సూపర్బ్ బౌలింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ తన మార్క్​ చూపిస్తున్నాడు.

సన్​రైజర్స్ నయా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ సూపర్బ్ బౌలింగ్​తో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్​తో పాటు కెప్టెన్సీలోనూ తన మార్క్​ చూపిస్తున్నాడు.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు మళ్లీ విజయాల బాట పట్టింది. గుజరాత్ టైటాన్స్​తో ఓటమితో నిరాశలో ఉన్న టీమ్.. ఆ కసిని అంతా చెన్నై సూపర్ కింగ్స్​ మీద చూపించింది. ఉప్పల్ స్టేడియంలో రుతురాజ్ సేనతో నిన్న జరిగిన మ్యాచ్​లో 6 వికెట్ల తేడాతో నెగ్గింది ఎస్​ఆర్​హెచ్. ఈ మ్యాచ్​లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై ఓవర్లన్నీ ఆడి 5 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. ఈ టార్గెట్​ను మరో 11 బంతులు మిగిలి ఉండగానే కమిన్స్ సేన ఛేజ్ చేసేసింది. బౌలింగ్​లో షాబాజ్ అహ్మద్, భువనేశ్వర్ కుమార్, కెప్టెన్ కమిన్స్ రాణించారు. బ్యాటింగ్​లో అభిషేక్ శర్మ (12 బంతుల్లో 37), ఎయిడెన్ మార్క్రమ్ (36 బంతుల్లో 50) అదరగొట్టారు. దీంతో మ్యాచ్ తర్వాత కమిన్స్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆ బ్యాటర్ తనను భయపెడుతున్నాడని అన్నాడు.

ఈ సీజన్ స్టార్ట్ అవడానికి ముందు జరిగిన మినీ ఆక్షన్​లో ఎస్ఆర్​హెచ్ ఏరి కోరి కమిన్స్​ను తెచ్చుకుంది. ఏకంగా రూ.20.50 కోట్ల ధర చెల్లించి అతడ్ని సొంతం చేసుకుంది. అంతేగాక రాగానే సారథ్య బాధ్యతలు అప్పగించింది. తన మీద ఫ్రాంచైజీ, అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని కమిన్స్ వమ్ము చేయడం లేదు. అద్భుతంగా బౌలింగ్ చేస్తూ టీమ్ సక్సెస్​లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. బంతితో రాణించడమే గాక కెప్టెన్​గానూ సక్సెస్ అవుతున్నాడు. యంగ్ క్రికెటర్లకు అవసరమైన సలహాలు ఇస్తూ టీమ్​ను విజయవంతంగా నడిపిస్తున్నాడు. అయితే అలాంటి కమిన్స్​నే ఓ అన్​క్యాప్డ్ బ్యాటర్ భయపెడుతున్నాడట. అతడు మరెవరో కాదు.. ఎస్ఆర్​హెచ్ ఓపెనర్ అభిషేక్ శర్మ. ఈ విషయాన్ని స్వయంగా కమిన్స్ రివీల్ చేశాడు. అభిషేక్​కు బౌలింగ్ చేయడం తన వల్ల కాదన్నాడు.

‘ఉప్పల్ వికెట్ డిఫరెంట్​గా ఉంది. ఆట సాగుతున్న కొద్దీ పిచ్ నెమ్మదించింది. ఇదో ఫెంటాస్టిక్ మ్యాచ్. మా టీమ్​లో చాలా మంది ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. శివమ్ దూబె స్పిన్నర్ల బౌలింగ్​లో చెలరేగుతుండటంతో పేసర్లను రంగంలోకి దింపాం. కట్టర్స్​తో బ్యాటర్లను ఇబ్బంది పెట్టాం. అభిషేక్ శర్మ సూపర్బ్​గా బ్యాటింగ్ చేశాడు. అతడికి మాత్రం నేను బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదు. అభిషేక్​తో పాటు హెడ్​కు బంతులు వేయడం నా వల్ల కాదు. ఎంఎస్ ధోని బ్యాటింగ్​కు వస్తున్నప్పుడు గ్రౌండ్​లోని ఆడియెన్స్​ చేసిన సందడి మామూలుగా లేదు. ఇక్కడ హోమ్ కండీషన్స్​లో ఆడటాన్ని మేం బాగా ఎంజాయ్ చేస్తాం’ అని కమిన్స్ చెప్పుకొచ్చాడు. కాగా, తన బ్యాటింగ్​తో కమిన్స్​ను భయపెడుతున్న అభిషేక్ శర్మ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచుల్లో 161 రన్స్ చేశాడు. తద్వారా ఆరెంజ్ క్యాప్ లిస్ట్​లో ఐదో ప్లేస్​లో ఉన్నాడు. మరి.. అభిషేక్​కు బౌలింగ్ వేయలేనంటూ కమిన్స్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments