ఓటమిలోనూ ఇంతటి అభిమానమా? నిన్న RCB ఫ్యాన్స్ చేసింది గమనించారా?

RR vs RCB- RCB Fans Maturity: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. ఈ సీజన్ నుంచి ఆర్సీబీ తప్పుకుంది. అయితే ఆ జట్టు అభిమానులకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

RR vs RCB- RCB Fans Maturity: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పోరాటం ముగిసింది. ఈ సీజన్ నుంచి ఆర్సీబీ తప్పుకుంది. అయితే ఆ జట్టు అభిమానులకు మాత్రం హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

క్రికెట్ ఫ్యాన్స్ కు ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎంతో ప్రత్యేకం. ఇక్కడ పోరాటాలు ఉంటాయి. గెలుపోటములు ఉంటాయి. ట్రోఫీలు ముద్దాడే క్షణాలు ఉంటాయి. టోపీలు తీసి తలదించుకు వెళ్లే మూమెంట్స్ ఉంటాయి. మైదానంలో ఆడేది 11 మందే.. వారి ఆట కోసం.. వారి విజయం కోసం కొన్ని కోట్ల మంది పరితపిస్తూ ఉంటారు. ప్లేయర్స్ మాత్రం విజయాన్ని ఎంజాయ్ చేస్తారు. పరజయాన్ని ఒక స్పీడ్ బ్రేకర్ గా భావించి కొనసాగుతారు. కానీ, ఒక సగటు అభిమాని ఓటమిని అంత తేలికగా తీసుకోలేడు. కానీ, ఈసారి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విషయంలో ఆ సీన్ రివర్స్ అయ్యింది. మ్యాచ్ లో ఓడిన ప్లేయర్స్ బాధలో ఉంటే.. అభిమానులు మాత్రం వారిని చీర్ చేస్తూ ఉత్సాహ పరిచారు. రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో మీరు ఈ సీన్ గమనించారా?

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ లో ఉన్న క్రేజ్, ఫ్యాన్ బేస్, అభిమానుల సపోర్ట్ మరో జట్టుకు ఉండదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఆ జట్టుపై వచ్చే మీమ్స్, వేసే సెటైర్లు, చేసే హేళన మరో జట్టును చేయరేమో? టీమ్ నిండా లెంజండ్స్ ఉన్నా.. ఒక్క టైటిల్ కొట్టలేకపోయారని ఒకరంటారు. నెక్స్ట్ సాలా కప్ నమ్దే అంటూ ఎద్దేవా చేస్తారు. ఇలాంటి మాటలు వింటూ కూడా వాళ్లు వారి టైమ్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నారు. అలాగే ఈ ఏడాది కూడా ఈ సాలా కప్ నమ్దే అన్నారు. కానీ, ఈ సీజన్ ఐపీఎల్ లో ఆర్సీబీ పోరాటం ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ మీద పోరాడి బెంగళూరు జట్టు ఓటమిపాలైంది. ఇది ఎలిమినేటర్ మ్యాచ్ కావడంతో వారి కథ ముగిసింది.

అయితే ఈ మ్యాచ్ తర్వాత ఒక విషయాన్ని చాలా మంది లైట్ తీసుకున్నారు. కానీ, అది కచ్చితంగా పట్టించుకోవాల్సిన విషయం. అలాంటి ఒక ఫ్యాన్స్, ఫ్యాన్ బేస్ ని సొంతం చేసుకోవడం ఆర్సీబీ జట్టు అదృష్టం అనే చెప్పాలి. విషయం ఏంటంటే.. మ్యాచ్ లో ఓటమి పాలయ్యారు. రాజస్థాన్ జట్టు క్వాలిఫయర్ కు వెళ్లిన ఆనందంలో ఉన్నారు. ఆర్సీబీ వాళ్లు ఓటమి బాధను జీర్ణించుకోలేకుండా ఉన్నారు. ఇలాంటి తరుణంలో ఒక పిడుగులాంటి వార్త అదే.. దినేశ్ కార్తీక్ ఐపీఎల్ కు గుడ్ బై చెప్పేశాడు. అసలే బాధలో ఉన్న ఫ్యాన్స్ కి ఈ వార్త మరింత షాక్ ఇచ్చింది. అయినా వాళ్లు తేరుకుని ఒక మంచి పని చేశారు.

అంతటి ఓటమి బాధలో కూడా ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతో హుందాతనం ప్రదర్శించారు. దినేశ్ కార్తీక్ కు గ్రాండ్ గా సెండాఫ్ ఇచ్చారు. రాజస్థాన్ ప్లేయర్స్, ఆర్సీబీ ప్లేయర్స్ డీకేకి గార్డ్ ఆఫ్ హానర్ ఇవ్వగా.. మైదానంలో ఉన్న ఫ్యాన్స్ అంతా డీకీ.. డీకే.. అంటూ కేకలు వేస్తూ దినేశ్ కార్తీక్ కి ఒక మర్చిపోలేని మూమెంట్ ని అందించారు. ఇప్పుడు నెట్టింట ఈ వీడియో వైరల్ అవుతోంది. నిజంగా ఆర్సీబీ ఫ్యాన్స్ ఓపికకు, వారి అభిమానానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఎందుకంటే అంతటి పరిపక్వత చాలా తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. ఈ సీజన్లో ఆర్సీబీ పోరాటం ముగిసినా కూడా వాళ్లు ఆ బాధను తట్టుకుని.. దినేశ్ కార్తీక్ కి వీడ్కోలు పలకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments