RCBతో పాటు ఆ టీమ్ ఫైనల్ చేరుతుంది.. ఇంట్రెస్టింగ్​గా ABD ప్రిడిక్షన్!

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​ మీద సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. నాలుగు జట్లలో నుంచి ఆర్సీబీతో పాటు ఆ టీమే ఫైనల్స్​కు చేరుతుందని అన్నాడు.

ఐపీఎల్-2024 ప్లేఆఫ్స్​ మీద సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రిడిక్షన్ చెప్పాడు. నాలుగు జట్లలో నుంచి ఆర్సీబీతో పాటు ఆ టీమే ఫైనల్స్​కు చేరుతుందని అన్నాడు.

గడిచిన కొన్ని వారాలుగా ఒకదాన్ని మించిన మరో మ్యాచ్, ఎడతెగని ఉత్కంఠతో జరిగిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్​తో ఐపీఎల్-2024 క్రికెట్ లవర్స్​కు కావాల్సినంత వినోదాన్ని పంచింది. గ్రూప్ స్టేజ్​లోని ఆఖరి మ్యాచ్ జరిగే వరకు ప్లేఆఫ్స్​ బెర్త్​లు కన్ఫర్మ్ కాలేదు. ఆఖరి కొన్ని మ్యాచ్​లు డూ ఆర్ డైగా సాగుతూ ఆడియెన్స్​ను టీవీలు, ఫోన్లకు కట్టిపడేశాయి. ఎట్టకేలకు గ్రూప్ స్టేజ్ ముగిసింది. ఇప్పుడు ప్లేఆఫ్స్​కు సమయం ఆసన్నమైంది. సన్​రైజర్స్, బెంగళూరు, కోల్​కతా, రాజస్థాన్ జట్లలో ఏదో ఒక జట్టు ఈసారి కప్పు కొట్టడం ఖాయం. మరో నాలుగు మ్యాచ్​లతో క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్-2024 ఫైనల్ గురించి సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ తన ప్రిడిక్షన్ చెప్పాడు.

ఐపీఎల్-2024 ఫైనల్ చేరే జట్లు ఇవేనంటూ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ప్రాతినిధ్యం వహించిన ఆర్సీబీ ఈసారి ఫైనల్​కు చేరడం పక్కా అని ఏబీడీ అన్నాడు. బెంగళూరుతో పాటు గ్రూప్ స్టేజ్​లో హవా నడిపించి టాప్​ ప్లేస్​లో నిలిచిన కోల్​కతా కూడా తుదిపోరుకు అర్హత సాధిస్తుందని జోస్యం పలికాడు. ఆర్సీబీ-కేకేఆర్​ టైటిల్​ ఫైట్​లో తలపడతాయని, ఈ రెండింట్లో నుంచి ఒక టీమ్ ఛాంపియన్​గా అవతరిస్తుందని డివిలియర్స్ చెప్పుకొచ్చాడు. ఎస్​ఆర్​హెచ్, రాజస్థాన్​కు ఛాన్స్ లేదని స్పష్టం చేశాడు. ఆర్సీబీ జట్టు వరుసగా 6 విజయాలు సాధించి ఫుల్ జోష్​లో ఉందన్నాడు. ఈ సీజన్​లో బెస్ట్ టీమ్​గా కేకేఆర్ నిలిచిందన్నాడు. కాబట్టి ఈ రెండు టీమ్స్ మధ్యే ఫైనల్ ఫైట్ జరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

ఈ సీజన్ ఫైనల్ మ్యాచ్​కు చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదిక కానుంది. ఈ నేపథ్యంలో కోల్​కతా ఫైనల్​కు చేరితే చెపాక్ పిచ్​ నుంచి వాళ్లకు ఎక్కువ మద్దతు దొరికే ఛాన్స్ ఉందన్నాడు ఏబీడీ. చెపాక్ పిచ్ స్వతహాగా స్పిన్​కు అనుకూలిస్తుంది. ఈ నేపథ్యంలో వరుణ్ చక్రవర్తి, సునీల్ నరైన్ రూపంలో వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉన్న కోల్​కతాకు ఈ మైదానం మరింత అడ్వాంటేజ్​గా మారే అవకాశాలు ఉన్నాయని వ్యాఖ్యానించాడు డివిలియర్స్. మరోవైపు అతడి ప్రిడిక్షన్​పై సన్​రైజర్స్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కేకేఆర్​కు ఎస్​ఆర్​హెచ్ షాక్ ఇవ్వడం పక్కా అని.. ఫైనల్​లో కలుసుకుందాం అని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. డివిలియర్స్ చెప్పిన టీమ్స్ ఫైనల్​కు వెళ్తాయని భావిస్తున్నారా? అతడి జోస్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments