Somesekhar
పాకిస్తాన్ కు చెందిన ఓ క్రికెట్ అభిమాని తన మనసులో ఉన్న వింత కోరికను బయటపెట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి బాబర్ అజమ్ ఐపీఎల్ ఆడితే చూడాలనుందని ఆ పాక్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దానికి హర్భజన్ సింగ్ తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు.
పాకిస్తాన్ కు చెందిన ఓ క్రికెట్ అభిమాని తన మనసులో ఉన్న వింత కోరికను బయటపెట్టాడు. విరాట్ కోహ్లీతో కలిసి బాబర్ అజమ్ ఐపీఎల్ ఆడితే చూడాలనుందని ఆ పాక్ ఫ్యాన్ ట్వీట్ చేశాడు. దానికి హర్భజన్ సింగ్ తనదైన స్టైల్లో కౌంటర్ వేశాడు.
Somesekhar
క్యాష్ రిచ్ లీగ్ IPLలో ఆడాలని ఏ ఆటగాడికి ఉండదు చెప్పండి. ఇప్పుడిప్పుడు క్రికెట్ లోకి అడుగుపెడుతున్న యంగ్ ప్లేయర్ల దగ్గర నుంచి రేపో మాపో రిటైర్మెంట్ ప్రకటించే సీనియర్ ప్లేయర్లు కూడా ఒక్కసారైన ఐపీఎల్ లో ఆడాలని కలలు కంటూ ఉంటారు. కేవలం ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా ఈ మెగాటోర్నీకి కోట్లలో అభిమానులు ఉన్నారు. దాయాది పాకిస్తాన్ లో ఐపీఎల్ కు వీరాభిమానులు ఉన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో ఓ పాక్ అభిమాని తన వింత కోరికను బయటపెట్టాడు. పాక్ ప్లేయర్లు ఈ లీగ్ లో ఆడితే చూడాలని ఉందని పేర్కొన్నాడు. దాంతో పాటుగా అతడు ఇంకే అన్నాడంటే?
ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభానికి ముందు పాక్ అభిమాని తన మనసులోని వింతైన కోరికను బయటపెట్టాడు. ట్విట్టర్ లో వేదికగా.. “ఈ ఐపీఎల్ లో ఆర్సీబీ టీమ్ లో విరాట్ కోహ్లీతో కలిసి బాబర్ ఆడితే చూడాలని ఉంది. అలాగే బుమ్రాతో పాటుగా షాహీన్ అఫ్రిది ముంబై ఇండియన్స్ కు, ధోనితో కలిసి మహ్మద్ రిజ్వాన్ చెన్నై టీమ్ కు ఆడితే.. చూడాలని ఉంది” అంటూ తన మనసులోని చిట్టాను బయటపెట్టాడు సదరు అభిమాని. ఇది పాక్ అభిమానుల కల అంటూ పలు జెర్సీల్లో క్రియేట్ చేసిన ఫొటోలు షేర్ చేశాడు. ఇక ఈ ఫొటోలు వైరల్ కావడంతో.. టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కంట్లో పడ్డాయి. మరి ఇది చూసిన మనోడు ఊరుకుంటాడా? తనదైన స్టైల్లో పాక్ ఫ్యాన్ కు కౌంటర్ వేశాడు.
పాక్ అభిమాని ట్వీట్ కు హర్భజన్ స్పందిస్తూ..”భారతీయులెవరికీ అలాంటి కల, ఆలోచనలు లేవు. మీకెందుకు వస్తున్నాయి ఇలాంటి డ్రీమ్స్. ముందు మీరు కలలు కనడం ఆపండి. నిద్రలో నుంచి మేల్కోండి బాయ్స్” అంటూ తన స్టైల్లో కౌంటర్ వేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా.. 2008 తొలి సీజన్ లో పాకిస్తాన్ ఆటగాళ్లు ఐపీఎల్ ఆడారు. కానీ ఆ తర్వాత పాకిస్తాన్-ఇండియా మధ్య రాజకీయ సంబంధాలు ఉద్రిక్తలకు దారితీయడంతో.. పాక్ ఆటగాళ్లపై ఐపీఎల్ ఆడకుండా నిషేధం విధించింది బీసీసీఐ. మరి పాక్ అభిమాని వింత కోరికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
No indian hv such dreams .. you guys plz stop dreaming 😴😂😂 wake up now https://t.co/EmraFXiIah
— Harbhajan Turbanator (@harbhajan_singh) March 15, 2024
ఇదికూడా చదవండి: IPL 2024.. తొలిమ్యాచ్ కు ముందు CSKకి ఊహించని షాక్!