singapore court: కోవిడ్ నిబంధనలు అతిక్రమించాడంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు!

కోవిడ్ నిబంధనలు అతిక్రమించాడంటూ రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు!

కరోనా సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన నిబంధనలు అమలు చేశాయి. ప్రతీ ఒక్కరు ఖచ్చితంగా మాస్కు ధరించి రోడ్లపైకి రావాలని సూచించింది. నిబంధనలు అతిక్రమించిన వారికి జరిమానా కూడా విధించింది. ఇంతే కాకుండా మాస్కు ధరించకపోతే కఠిన చర్యలు తప్పవంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఇక కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోవడంతో చాలా మంది మాస్కులు వాడకమే మానేశారు. ఇదిలా ఉంటే.. కోవిడ్ నిబంధనలు అతిక్రమించాడంటూ కోర్టు అతనికి రెండేళ్ల జైలు శిక్ష విధిస్తూ సోమవారం తీర్పును వెలువరించింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే?

తమిళ్ సెల్వం రామయ్య (64) అనే భారత సంతతికి చెందిన వ్యక్తి సింగపూర్ లోని ఓ కంపెనీలో క్లీనర్ గా పని చేసేవాడు. అయితే 2021లో అతడికి కరోనా సోకినట్లు తెలుస్తుంది. ఆ సమయంలో అతడు ఎలాంటి మాస్కు ధరించకుండా తన సహచరుల ముఖం మీద దగ్గాడని అతనిపై ఆరోపణలు వచ్చాయి. కోవిడ్ ఉందని తెలిసినప్పటికీ రామయ్య ఇలా చేశాడంటూ అతనిపై అభియోగాలు నమోదు అయ్యాయి. ఇంతే కాకుండా ఇతనిపై బాధితులు కోర్టులో ఫిర్యాదు కూడా చేసినట్లు సమాచారం. అయితే ఈ కేసుపై న్యాయస్థానం స్పందించి సోమవారం సంచలన తీర్పును వెలువరించింది. అతడు కోవిడ్ నిబంధనలు అతిక్రమించి ఇతరులపై దగ్గినందుకు గాను రెండేళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది.

Show comments