Pavel Durov: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ అరెస్ట్! కారణం ఏంటంటే?

Telegram founder Pavel Durov arrested: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Telegram founder Pavel Durov arrested: టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టెలిగ్రామ్ ఫౌండర్, సీఈవో పావెల్ దురోవ్ ను నిన్న(శనివారం)రాత్రి ఫ్రాన్స్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. అజర్ బైజాన్ లోని బాకు నుంచి తన ప్రైవేట్ జెట్ లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. ఈ క్రమంలోనే పోలీసులు దురోవ్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ విషయంపై టెలిగ్రామ్ అధికారికంగా ఇంకా స్పందించనప్పటికీ.. అతడిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. అసలు ఇంతకీ టెలిగ్రామ్ ఫౌండర్ ను ఎందుకు అరెస్ట్ చేశారో కారణం తెలుసుకుందాం.

టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్ దురోవ్ ను ఫ్రాన్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఫ్రెంచ్ పోలీసులు తెలిపారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం, మనీలాండరింగ్, సైబర్ నేరాలు లాంటి ఆరోపణలతో దురోవ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. టెలిగ్రామ్ యాప్ లో మోడరేటర్లు లేకపోవడంతో.. మెసేజింగ్ యాప్ లో నేర కార్యకలాపాలు పెరిగిపోతున్నట్లు ఫ్రెంచ్ పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే అతడికి అరెస్ట్ వారెంట్ ను జారీ చేశారు. నేర కార్యకలాపాలను అరికట్టడంలో టెలిగ్రామ్ విఫలం అయ్యిందని ఏజెన్సీ పేర్కొంది.

ఇదిలా ఉండగా.. హ్యాకర్లు ఇజ్రాయెల్ కు సంబంధించిన రహస్యాలను టెలిగ్రామ్ లో పబ్లిష్ అయ్యాయని వాటిని తొలగించాలని ఇజ్రాయెల్ కోరింది. కానీ టెలిగ్రామ్ దానికి అంగీకరించలేదని సమాచారం. ఈ క్రమంలోనే నేర కార్యకలాపాలకు వేదికగా టెలిగ్రామ్ మారిందన్న అభియోగాలతో దురోవ్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో నేరం రుజువైతే.. అతడికి 20 ఏళ్లు శిక్షపడే అకాశం ఉంది. కాగా.. ప్రస్తుతం టెలిగ్రామ్ కు 900 మిలియన్ల మంది యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. 2014లో ఫ్రాన్స్ ను విడిచిపెట్టి దుబాయ్ వచ్చాడు దురోవ్. టెలిగ్రామ్ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంది. ఇక దురోవ్ అరెస్ట్ పై ఫ్రాన్స్ బ్లాగర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడి అరెస్ట్ కు నిరసనగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఫ్రాన్స్ రాయబార కార్యాలయాల ముందు నిరసన తెలుపనున్నట్లు ప్రకటించారు.

Show comments