nagidream
Indian Origin Woman Gave Big Shock To Tesla Company: భారత సంతతికి చెందిన మహిళ టెస్లా కంపెనీకి భారీ షాక్ ఇచ్చారు. 11 ఏళ్లుగా సీనియర్ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్న మహిళా ఉద్యోగి ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ ఇచ్చారు.
Indian Origin Woman Gave Big Shock To Tesla Company: భారత సంతతికి చెందిన మహిళ టెస్లా కంపెనీకి భారీ షాక్ ఇచ్చారు. 11 ఏళ్లుగా సీనియర్ ఉద్యోగిగా గుర్తింపు తెచ్చుకున్న మహిళా ఉద్యోగి ఉన్నట్టుండి ఎలాన్ మస్క్ కి ఊహించని షాక్ ఇచ్చారు.
nagidream
ఒక కంపెనీలో చిన్న హోదా కలిగిన ఉద్యోగంలో చేరి ఏళ్ల తరబడి అదే కంపెనీలో పని చేస్తూ ఒక్కో మెట్టు ఎక్కుతూ పై హోదా కలిగిన ఉద్యోగులు పొందుతుంటారు. ఈ క్రమంలో ఎన్నో కష్టాలు, సమస్యలు, సంఘర్షణలు, అభిప్రాయబేధాలు వంటివి తలెత్తుతుంటాయి. అయితే ఏదో ఒకరోజు మానేయాలి అని డిసైడ్ అవుతారు. కంపెనీలో పని చేయడం కష్టం అని భావించి కొంతమంది రాజీనామా చేయాలని నిర్ణయించుకుంటారు. ఎన్నో ఏళ్ల నుంచి చేస్తున్న సీనియర్ ఉద్యోగులు మానేస్తే కంపెనీకి పెద్ద షాక్ తగిలినట్టు అవుతుంది. తాజాగా భారత సంతతి మహిళ టెస్లా కంపెనీకి షాక్ ఇచ్చారు. ఎలాన్ మస్క్ కి చెందిన ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ టెస్లాకు భారత సంతతికి చెందిన శ్రీలా వెంకటరత్నం షాకిచ్చారు.
2013 నుంచి టెస్లాలో వివిధ హోదాల్లో పనిచేసిన శ్రీలా వెంకటరత్నం ఆ సంస్థకు గుడ్ బై చెప్పారు. కుటుంబంతో సమయం గడపడానికి, ఫ్రెండ్స్ తో సరదాగా గడపడానికి తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను లింక్డ్ ఇన్ ఖాతాలో పోస్ట్ చేశారు. 2013లో టెస్లాలో చేరిన శ్రీలా వెంకటరత్నం ఈ 11 ఏళ్లలో వివిధ హోదాల్లో పని చేశారు. తొలుత డైరెక్టర్ ఆఫ్ ఫైనాన్స్ ఆపరేషన్ హోదాలో విధుల్లో చేరిన వెంకటరత్నం.. ఆ తర్వాత సీనియర్ డైరెక్టర్ గా పదోన్నతి పొందారు. 2019 నుంచి 2024 వరకూ కూడా టెస్లా వైస్ ప్రెసిడెంట్ హోదాలో బాధ్యతలు నిర్వర్తించారు. సుదీర్ఘ విరామం తర్వాత టెస్లాకు ఆమె రాజీనామా చేశారు. ఈ మేరకు తన లింక్డిన్ ఖాతాలో పోస్ట్ షేర్ చేశారు. కంపెనీలో చేరిన తర్వాత టెస్లా 700 బిలియన్ డాలర్ల కంపెనీగా అవతరించడం సంతోషం కల్గించే విషయమని శ్రీలా వెంకటరత్నం అన్నారు.
టెస్లాతో తన ప్రయాణంలో ఎన్నో విజయాలు సాధించానని.. ఈ విజయంలో తోటి ఉద్యోగుల సహకారం మరువలేనిదని అన్నారు. కొంతకాలం పాటు విరామం తర్వాత కొత్త అవకాశాల కోసం అన్వేషిస్తానని ఆమె పేర్కొన్నారు. అయితే ఆమె పెట్టిన పోస్టుకి టెస్లా కంపెనీ మాజీ సీఎఫ్ఓ కామెంట్ కి శ్రీలా వెంకటరత్నం.. ‘టెస్లాలో పని చేయడం కష్టం’ అంటూ సమాధానం ఇచ్చారు. దానికి ఆ మాజీ సీఎఫ్ఓ కూడా.. ‘నిజమే.. టెస్లాలో పనిచేయడం అంత సులువు కాదు. మానేసి మంచి పని చేశావ్’ అంటూ సమాధానం ఇచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ముగ్గురు ఎగ్జిక్యూటివ్ లు టెస్లాను వీడారు. తాజాగా సీనియర్ ఉద్యోగి శ్రీలా వెంకటరత్నం గుడ్ బై చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.