నలుగురు పిల్లలు ఉంటే.. జీవితాంతం ట్యాక్స్ కట్టక్కర్లేదు! ఎక్కడంటే

Income Tax: ప్రపంచంలో వ్యాప్తంగా నానాటికి జనాభా పెరుగుతుంది. చాలా దేశాల్లో వేగంగా జనాభా పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో మాత్రం జనాభా క్షీణిత సమస్య కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యను పరిష్కరించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి

Income Tax: ప్రపంచంలో వ్యాప్తంగా నానాటికి జనాభా పెరుగుతుంది. చాలా దేశాల్లో వేగంగా జనాభా పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో మాత్రం జనాభా క్షీణిత సమస్య కనిపిస్తోంది. ఈ క్రమంలోనే సమస్యను పరిష్కరించేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి

ప్రపంచంలోని అనేక దేశాలు వివిధ సమస్యలతో  బాధ పడుతుంటాయి. ఆర్థిక, ఉగ్రవాద, నీటి, ఆహార, పేదరికం వంటి వివిధ సమస్యలతో బాధ పడుతుంటాయి. ఇదే సమయంలో తమ దేశంలో ఏర్పడిన సమస్యలను నివారించేందుకు, పరిష్కరించేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటాయి. కొన్ని దేశాల్లో అధిక జనాభ సమస్య అయితే..మరికొన్ని దేశాల్లో జనాభా క్షీణిత పెద్ద సమస్యగా మారింది. ఇక జనాభాను పెంచేందుకు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. గతంలో బిడ్డను కంటే 25 లక్షలు ఇస్తామని ఓ ప్రభుత్వం చెప్పగా..ఓ దేశం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కనీసం నలుగురు పిల్లలు ఉంటే..జీవితాంతం  ట్యాక్స్ కట్టక్కర్లేదని ఆఫర్ ఇచ్చింది. మరి.. ఎక్కడ, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

ప్రపంచంలో వ్యాప్తంగా నానాటికి జనాభా పెరుగుతుంది. చాలా దేశాల్లో వేగంగా జనాభా పెరుగుదల కనిపిస్తుంది. ఇదే సమయంలో కొన్ని దేశాల్లో మాత్రం జనాభా క్షీణిత సమస్య కనిపిస్తోంది. ఆర్థిక, వృతిపరమైన సవాళ్ల కారణంగా కొన్ని దేశాల్లోని యువత పెళ్లిళ్లపై  ఆసక్తి చూపడం లేదు. దీంతో మానవ వనరుల సమస్య, అనే భవిష్యత్ తరం తగ్గిపోవడం వంటివి జరుగుతున్నాయి. దీంతో వలసలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ముఖ్యంగా జపాన్ వంటి దేశాలు జనాభ క్షీణతో అల్లాడిపోతున్నాయి. అందుకే ఆ దేశ ప్రజలకు పలు రకాల ఆఫర్లు ప్రకటించింది. ఇలానే ఐరోపా దేశం హంగేరీ కూడా ప్రస్తుతం ఇలాంటి సమస్యనే ఎదుర్కొంటోంది.

దీంతో జనాభాను పెంచుకునేందుకు ఆ దేశ ప్రభుత్వం వెరైటీగా ఆలోచనలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రజలకు, ముఖ్యంగా వ్యాపారస్తులకు హంగేరి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇందులోభాగంగానే ఎక్కువమంది సంతానం ఉన్నవారు జీవితాంతం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదని తెలిపింది. ఈ విషయాన్ని స్వయంగా దేశ ప్రధానే ప్రకటించారు. హంగేరి ప్రధాని విక్టోర్ అర్బన్ మాట్లాడుతూ..ఐరోపాలో జననాలు చాలా తక్కువగా ఉన్నాయని, ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో ఈ సమస్యకు వలసలు పరిష్కారంగా మారుతున్నాయని ఆయన పేర్కొన్నారు.

జనాభ తక్కువ ఉన్న కారణంగా ఆ లోటు పూడ్చేందుకు వలసదారులను ఆహ్వానించాల్సి వస్తోందని తెలిపారు.అందుకే తాము విభిన్న ఆలోచనలతో ముందుకొచ్చామని, కనీసం నలుగురు లేదా అంతకంటే ఎక్కువమందిని కనే మహిళలకు తమ జీవితకాలం వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు కల్పిస్తానమంటూ ఆయన ఆసక్తికర ప్రకటన చేశారు. వీటితో పాటు పెద్ద కుటుంబాలు పెద్ద పెద్ద కార్లు కొనుగోలు చేసేందుకు వీలుగా రాయితీ కూడా ఇవ్వనున్నట్లు  వెల్లడించారు. ఇలాంటి ఆఫర్లతో పెళ్లిళ్లు, కుటుంబవ్యవస్థను ప్రోత్సహించినట్లవుతుందని అక్కడి ప్రభుత్వం అభిప్రాయపడుతోంది. మరి.. హంగేరి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments