18 ఏళ్లకే పో*ర్న్‌ ఇండస్ట్రీలోకి వచ్చిన సోఫియా లియోన్‌ మృతి! చివరి వీడియో వైరల్‌

18 ఏళ్లకే పో*ర్న్‌ ఇండస్ట్రీలోకి వచ్చిన సోఫియా లియోన్‌ మృతి! చివరి వీడియో వైరల్‌

Adult Star, Sophia Leone: అడల్ట్‌ సినిమాల్లో నటించే పోర్న్‌స్టార్‌ సోఫియా లియోన్‌ 26 ఏళ్ల వయసులోనే మృతి చెందింది. ఆమె ఈ నెల 1న మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె మృతి గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

Adult Star, Sophia Leone: అడల్ట్‌ సినిమాల్లో నటించే పోర్న్‌స్టార్‌ సోఫియా లియోన్‌ 26 ఏళ్ల వయసులోనే మృతి చెందింది. ఆమె ఈ నెల 1న మరణించినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఆమె మృతి గురించి వివరాలు ఇలా ఉన్నాయి..

అడల్ట్‌ ఫిలిమ్స్‌లో నటించే పోర్న్‌స్టార్‌ సోఫియా లియోన్‌ మృతి చెందింది. చాలా చిన్న వయసులోనే కేవలం 26 ఏళ్లకే ఆమె కన్ను మూసింది. ఆమె మరణ వార్త చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 1వ తేదీనే ఆమె మరణించినట్లు.. ఆమె అంత్యక్రియల కోసం నిధులు సేకరించేందుకు ‘గో ఫండ్‌ మీ’ అనే వెబ్‌సైట్‌తో ఆమె మృతి వివరాలు తెలియజేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది. అయితే.. ఆమె మృతిపై పలు అనుమానాలు ఉన్నట్లు తెలుస్తోంది. సోఫియా మృతి చెందినట్లు.. ఆమె స్టెఫ్‌ ఫాదర్‌ వెల్లడించారు. కొన్ని రోజుల క్రితం నుంచి సోఫియాకు ఫోన్‌ చేస్తున్నా ఆమె లిఫ్ట్‌ చేయకపోవడంతో అనుమానం వచ్చి.. మార్చి 1న ఆమె అపార్ట్‌మెంట్‌కు వెళ్లి చూడగా.. అనుమానాస్పద స్థితిలో ఆమె మరణించి ఉందని ఆయన వెల్లడించారు.

అయితే.. ఇప్పటి వరకు కూడా సోఫియా మరణానికి కారణం ఏంటో? ఎలా మరణించిందో? అనే విషయాలు తెలియరాలేదు. ఆమె మృతిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది. సోఫియా కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు కూడా ఆమె మరణానికి కారణం తెలియడం లేదు. పోర్న్‌ ఇండస్ట్రీలో స్టార్‌గా వెలుగొందిన సోఫియా.. అంత్యక్రియలకు డబ్బులేక.. గో ఫండ్‌ మీ అనే స్వచ్ఛంద సంస్థ ఫండ్స్‌ కోసం కోరడం చర్చనీయాంశంగా మారింది. అమెరికాలోని వియామీలో 1997 జూన్‌ 10న జన్మించిన సోఫియా లియోన్‌ ఆమె 18వ ఏటనే పోర్న్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. చాలా చిన్న వయసులోనే ఈ అడల్ట్‌ కంటెంట్‌ వీడియోస్‌లో నటించిన లియోన్‌.. కేవలం 26 ఏళ్లకే మరణించింది. అయితే.. ఈ మధ్య కాలంలో అడల్ట్‌ స్టార్ల మరణాలు పెరిగిపోతున్నాయి.

కొన్ని వారాల క్రితం కాగ్నీ లిన్‌ కార్టర్‌ అనే పోర్న్‌ స్టార్‌ సూసైడ్‌ చేసుకుని చనిపోయింది. అలాగే మరో పోర్న్‌స్టార్‌ ఎమిలీ విల్లిస్‌ ఎక్కువ మోతాదులో డ్రగ్స్‌ తీసుకుని కోమాలోకి వెళ్లి, ఆ తర్వాత మరణించింది. అలాగే జెస్సీ జెన్‌, ఆమె ప్రియుడు కూడా జనవరిలో అనుమానాస్పద స్థితిలోనే మరణించారు. వారు కూడా డ్రగ్స్‌ను ఎక్కువ తీసుకోవడం వల్లే మరణించి ఉంటారని పోలీసులు అనుమానించారు. ఇప్పుడు సోఫియా లియోన్‌ సైతం అనుమానాస్పద స్థితిలోనే మరణించడంతో ఆమె కూడా డ్రగ్స్‌ ఎక్కువగా వాడటం వల్లే చనిపోయిందా? లేక ఇంకా ఏమైన కారణాలు ఉన్నాయా అనే విషయం తెలియాల్సి ఉంది. కాగా సోఫియాకు జంతువులంటే చాలా ఇష్టం. కాగా ఈ మధ్యకాలంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. మరి 26 ఏళ్లకు సోఫియా మరణించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments