P Krishna
Sperm Count Decreasing in Males: పెళ్లైన తర్వాత పెద్దలు కొత్త జంటను నిండూ నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని దీవిస్తుంటారు. పెళ్లైన రెండు మూడేళ్లకు కూడా పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు.
Sperm Count Decreasing in Males: పెళ్లైన తర్వాత పెద్దలు కొత్త జంటను నిండూ నూరేళ్లు పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని దీవిస్తుంటారు. పెళ్లైన రెండు మూడేళ్లకు కూడా పిల్లలు పుట్టకపోవడంతో దంపతులు డాక్టర్ల వద్దకు పరుగులు పెడుతున్నారు.
P Krishna
భారత దేశంలో వివాహబంధం ఎంతో పవిత్రమైనది. పెద్దల సమక్షంలో మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను నిండూ నూరేళ్లు పిల్లాపాపలతో సుఖంగా జీవించాలని దీవిస్తుంటారు. ఈ మధ్య కాలంలో పెళ్లైన తర్వాత పిల్లల కోసం కనీసం ఒకటి రెండేళ్లు గ్యాప్ తీసుకుంటున్నారు కొత్త జంట. ఆ తర్వాత కూడా పిల్లలు పుట్టకపోవడంతో వైద్యులను సంప్రదించడం మొదలు పెడుతున్నారు. రెండు మూడేళ్లు గడిచినా పిల్లలు పుట్టకపోతే కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి మొదలవుతుంది. పెళ్లైనా తండ్రులు కాలేకపోతున్నారు.. దీనికి కారణం స్పెర్మ్ కౌంట్ తగ్గిపోవడమేనని తాజాగా సర్వేల్లో వెల్లడైంది. వివరాల్లోకి వెళితే..
దేశంలో ఈ మధ్య కాలంలో పెళ్లైన తర్వాత ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టకపోవడంతో చాలా మంది మగవాళ్లు తీవ్ర నిరాశలో ఉంటున్నారు. మగతనం ఉన్నా.. పిల్లలు పుట్టకపోవడం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. ఈ సమస్య ఒక్క భారత దేశంలోనే కాదు.. 53 దేశాల్లో ఉందని ‘హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ’ తాజా సర్వేలో తెలిసింది. మగాళ్లలో మగతనం ఉన్నప్పటికీ.. తండ్రి అయ్యే సామర్థ్యం మాత్రం రోజు రోజుకీ తగ్గిపోతుందట. ఈ మేరకు 1973 నుంచి 2018 మధ్య కాలంలో దాాపు 223 పత్రికలు, పలు మ్యాగజైన్స్ లో వచ్చిన కథనాల ఆధారంగా సంస్థ సర్వేలో తెలిన సంచలన నిజాలు. హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ 53 దేశాలకు చెందిన 57 వేల మంది పురుషుల నుంచి సేకరించిన శాంపిల్స్ ను టెస్ట్ చేసి ఈ వివరాలు కనుగొన్నట్లు తెలిపింది.
పురుషుల్లో స్పెర్మ్ నాణ్యత ఏకంగా 51.6 శాతానికి పడిపోయిందని తెలిపింది. అదే విధంగా స్పెర్మ్ కౌంట్ 62.3 శాతానికి తగ్గిందని తెలిపింది. 1973 ముందు పోల్చుతే.. 2018 నాటికి ఈ పరిస్థితి వచ్చిందని హ్యూమన్ రీ ప్రొడక్షన్ సంస్థ సర్వే సారాంశం. దీనికి పలు కారణాలు ఉన్నాయని.. ప్రధానమైనది మనిషి జీవవన శైలి. ప్రస్తుతం మనిషి జీవన శైలిలో ఎన్నో మార్పులు వచ్చాయని.. ఒత్తిడి, టెన్షన్, ఆహారపు, లిక్కర్ తదితర అలవాట్ల వల్ల పురుషల్లో స్పెర్మ్ కౌంట్ పడిపోతుందని సర్వేలో తెలినట్లు వారు వివరించారు. భవిష్యత్ లో ఈ సమస్య మరింత తీవ్రం కావొచ్చు అని హెచ్చరించారు. పని ఒత్తిడి నుంచి ఉపశమనం, ప్రొటీన్లతో కూడిన ఆహారం అలవాటు చేసుకుంటే సంతానభా