TS Intermediate Exams 2024: ఈసారి ముందుగానే ఇంటర్ పరీక్షలు.. కారణమిదే అంటున్న బోర్డు

Intermediate Exams: ఈసారి ముందుగానే ఇంటర్ పరీక్షలు.. కారణమిదే అంటున్న బోర్డు

ప్రతి ఏడాది మార్చి నెల మధ్యలో ఇంటర్, పదో తరగతి, మిగతా పరీక్షల నిర్వహణ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఎగ్జామ్స్ నిర్వహిస్తారంట. ఆ వివరాలు..

ప్రతి ఏడాది మార్చి నెల మధ్యలో ఇంటర్, పదో తరగతి, మిగతా పరీక్షల నిర్వహణ ఉంటుంది. అయితే ఈసారి మాత్రం కాస్త ముందుగానే ఎగ్జామ్స్ నిర్వహిస్తారంట. ఆ వివరాలు..

మార్చి నెల ప్రారంభం అయ్యిందంటే.. చాలు పరీక్షల సీజన్ మొదలవుతేంది. ఇంటర్, పదో తరగతి, డిగ్రీ, మిగతా తరగతుల పరీక్షలు వరుసగా వస్తూనే ఉంటాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఇంటర్ పరీక్షలను కాస్త ముందుగానే నిర్వహించనున్నారు అధికారులు. అలానే పదో పరీక్షలను కూడా. తాజాగా పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇంటర్ బోర్డు కీలక ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ సారి పరీక్షలు ముందుగా నిర్వహించడానికి ఓ కారణం ఉంది అంటున్నారు అధికారులు. ఆ వివరాలు..

మన దగ్గరనే కాక దేశవ్యాప్తంగా.. దాదాపుగా ప్రతీ ఏడాది మార్చిలో.. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తారు. కానీ ఈ సారి తెలంగాణలో మాత్రం కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది. అందుకు కారణం ఉండి. వచ్చే ఏడాది అనగా.. 2024 ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి. దీంతో పరీక్షల నిర్వహణకు, ఆన్సర్ షీట్ల వ్యాలుయేషన్స్ కు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ముందుగానే పరీక్షలు నిర్వహించేలా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలు అ్వవగానే పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉండటంతో.. అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

మార్చి 1వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభించాలని ఇంటర్ బోర్డు భావిస్తోంది. అయితే కొత్త ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రి ఇంకా బాధ్యతలు స్వీకరించలేదు. మంత్రి ఆమోదం అనంతరం ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారికంగా ప్రకటించనున్నారు. అలానే ఏప్రిల్ 1వ తేదీ నుంచి 15వ తేదీ మధ్య జేఈఈ మెయిన్స్ పరీక్షలు కూడా ఉన్నాయి. దీంతో ముందుగా ఇంటర్ పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులకు ఆ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేందుకు తగిన సమయం ఉంటుందని భావిస్తున్నారు. అంతేకాక ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాతే టెన్త్ క్లాస్ పరీక్షలు జరపాల్సి ఉంటుంది. ఈ కారణాల నేపథ్యంలో ఈ సారి మార్చి 1వ తేదీ నుంచే పరీక్షలు మొదలుపెట్టాలని అధికారులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే..

ఇంటర్ పరీక్షలు ముగిసిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని విద్యా శాఖ అధికారులు భావిస్తున్నారు. మార్చి 12న, లేదా 14వ తేదీన ఈ పరీక్షలు మొదలుపెట్టాలని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఫిబ్రవరి 26వ తేదీ నుంచి ప్రీఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇవి మార్చి 9వ తేదీ వరకు కొనసాగే అవకాశం ఉంది. తెలంగాణ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరీక్షల నిర్వహణకు సంబంధించి ఓ క్లారిటీ రానుంది.

Show comments