TG TET 2024: వారికి గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్! ఏంటంటే?

TG TET 2024: గతంలో టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వనివారు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుంది.

TG TET 2024: గతంలో టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వనివారు చాలా మంది ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారికి తెలంగాణ ప్రభుత్వం మంచి అవకాశం ఇస్తుంది.

తెలంగాణ టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (టీజీ టెట్‌ 2024) అభ్యర్ధులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. ఇంతకీ ఆ అప్ డేట్ ఏంటి? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక గతంలో టెట్ 2024 అప్లికేషన్ ప్రాసెస్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. దీనికి కారణం టెక్నికల్ ప్రాబ్లెం. అందుకే టెట్‌ ఆన్‌లైన్‌ దరఖాస్తు విండో ఓపెన్‌ చేయలేకపోతున్నామని పాఠశాల విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లెంని సరిచేసి.. నవంబర్ 7 నాటికి టెట్‌ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామని కూడా చెప్పింది. ఈ రోజైనా టెట్‌ అప్లికేషన్‌ విండో అందుబాటులోకి వస్తుందో.. రాదోనని అభ్యర్ధులు కంగారు పడుతున్నారు. నిజానికి నవంబర్ 5న అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ కావాల్సి ఉన్నా కానీ అది గురువారానికి వాయిదా పడింది. ఒకవేళ నవంబర్‌ 7వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే ఇదే నెల 20వ తేదీ దాకా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది.

ఇక టెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 1 నుంచి 20వ తేదీ దాకా జరగనున్నాయి. ఈ సంవత్సరం ఫస్ట్ టెట్‌ ఎగ్జామ్ కు అప్లికేషన్ ఫీజుని రూ.400ల నుంచి రూ.1000కి విద్యాశాఖ పెంచింది. దీంతో అప్లికేషన్ ఫీజు ఎక్కువగా ఉందని అభ్యర్ధులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో ఆ ఫీజుని తగ్గించాలని కోరుతూ ఆందోళనలు చేశారు. అయితే దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న కారణంగా ఫీజు తగ్గించలేమని అన్నారు. అయితే ఈ టెట్‌లో అర్హత సాధించని వారికి మాత్రం గుడ్ న్యూస్ చెప్పారు. వారు వచ్చేసారి జరిగే పరీక్షకు ఫ్రీగా అప్లై చేసుకోవచ్చని ప్రకటించారు.

గత టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా 2.35 లక్షల మంది పరీక్ష రాశారు. అయితే వారిలో 1.09 లక్షల మంది పాసయ్యారు. అంటే దాదాపు 1.26 లక్షల మంది పాస్ కాలేదన్నమాట. వారంతా కూడా ఈసారి టెట్‌కు అప్లై చేసుకుంటే ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. సో వారికి ఇది సూపర్ ఛాన్స్ అనే చెప్పాలి. అయితే కొత్తగా పరీక్ష రాసేవారు మాత్రం ఫీజు ఎక్కువగా ఉందని కొంచెం తగ్గించాలని కోరుతున్నారు. మరి ఈ అభ్యర్ధనపై రేవంత్ సర్కార్‌ ఏవిధంగా స్పందిస్తుందనేది చూడాలి..ఇక టెట్‌ ఎగ్జామ్ విషయానికి వస్తే.. ఇందులో మొత్తం రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్ లో 150 మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది. ఓసీలకు 90, బీసీ 75, మిగిలిన వారికి 60 మార్కులు వస్తే టెట్‌లో పాస్ అవుతారు. టెట్‌లో క్వాలిఫై అయిన వారికి మాత్రమే డీఎస్సీ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాక ఈ టెట్‌లో వచ్చిన మార్కులకు డీఎస్సీలో 20 శాతం వెయిటేజీని ఇస్తారు. ఇదీ సంగతి. మరి టీజీ టెట్ 2024 పై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments