P Venkatesh
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మీ పిల్లలను చేర్పించాలనుకుంటే వెంటనే అప్లై చేయండి.
తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మీ పిల్లలను చేర్పించాలనుకుంటే వెంటనే అప్లై చేయండి.
P Venkatesh
సమాజంలో సైనికులకు ఎనలేని గౌరవం ఉంటుంది. ఉగ్ర వాదుల నుంచి, శత్రు దేశాల దాడుల నుంచి నిరంతరం దేశాన్ని, ప్రజలను రక్షిస్తూ కీలక పాత్ర పోషిస్తారు సైనికులు. కాగా త్రివిధ దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలని యువత కలలు కంటుంటారు. దేశ రక్షణలో భాగం పంచుకోవాలని భావిస్తుంటారు. అయితే మిలిటరీ ఎడ్యుకేషన్ ఇప్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక బాలుర పాఠశాలను ఏర్పాటు చేసింది. ఈ సైనిక గురుకుల స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మీ పిల్లలను సైనిక్ స్కూల్లో చేర్పించాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి.
కరీంనగర్ జిల్లా రుక్మాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల సైనిక పాఠశాలలో 2023-24 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 6వ తరగతిలో 80 సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఫిబ్రవరి 20న నోటిఫికేషన్ విడుదల చేసింది. సరైన అర్హతలు గల బాలురు మార్చి 1 వరకు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రవేశాలకు సంబంధించి మార్చి 10న ఎంట్రెన్స్ ఎగ్జామ్ నిర్వహిస్తారు.
5వ తరగతి ఉత్తీర్ణులైన వారు, ప్రస్తుతం చదువుతున్న బాలురు దరఖాస్తు చేసకోవచ్చు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2,00,000, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1,50,000కు మించకూడదు. విద్యార్థులు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. విద్యార్థులు 01.04.2024 నాటికి 11 సంవత్సరాలకు మించకూడదు. 01.04.2013 నుంచి 31.03.2015 మధ్య జన్మించి ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ. 200 చెల్లించాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభమైంది.. మార్చి 1న ముగుస్తుంది. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.