Marwadi University- Best University For Telugu Students: మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి బెస్ట్ యూనివర్సిటీ.. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు!

మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ కి బెస్ట్ యూనివర్సిటీ.. ముఖ్యంగా తెలుగు విద్యార్థులకు!

Marwadi University- Best University For Telugu Students: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల కోసం ఒక యూనివర్సిటీని తీసుకొచ్చాం. ఇది అసలు తెలుగు విద్యార్థులకు ఎందుకు అంత స్పెషలో తెలుసుకోండి.

Marwadi University- Best University For Telugu Students: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు విద్యార్థుల కోసం ఒక యూనివర్సిటీని తీసుకొచ్చాం. ఇది అసలు తెలుగు విద్యార్థులకు ఎందుకు అంత స్పెషలో తెలుసుకోండి.

ఈరోజుల్లో లక్షలు పోసినా బెస్ట్ ఎడ్యుకేషన్ లభిస్తుంది అనే భరోసా లేదు. స్కూల్స్, కాలేజులు సంగతి పక్కన పెడితే విశ్వవిద్యాలయం అనే సరికి తల్లిదండ్రులు ఎంతెంత ఫీజులు కట్టాలో అని కంగారు పడిపోతారూ ఉంటారు. ఒకవేళ అన్ని లక్షలు కట్టినా సరైన ప్లేస్మెంట్ లభిస్తుంది అనే నమ్మకాన్ని వర్సిటీలు కలిగించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యార్థులకు భరోసా కలిగించడమే కాకుండా.. మధ్య తరగతి విద్యార్థుల కోసం బెస్ట్ ఎడ్యుకేషన్ ని అందిస్తున్నారు. అలాగే ప్లేస్మెంట్ గ్యారెంటీ కూడా ఇస్తూ.. విద్యార్థుల పాలిట ఈ యూనివర్సిటీ ఒక వరంలా మారిపోయింది. మరి.. ఆ యూనివర్సిటీ ఎక్కడ ఉంది? వారి ప్రత్యేకతలు ఏంటో చూద్దాం.

ఇప్పుడు చెప్పుకుంటున్న యూనివర్సిటీ మరేదో కాదు.. మార్వాడీ యూనివర్సిటీ. ఇది గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఉంది. ఈ మార్వాడీ యూనివర్సిటీ ప్రత్యేకత ఏంటంటే.. దీనికి NAAC A+ ర్యాంకింగ్ ఉంది. అంటే ఎడ్యూకేషన్ పరంగా మీ విద్యార్థులకు బెస్ట్ టీచింగ్ ని అందించగలరు. అందుకు తగిన ఇన్ ఫ్రాస్ట్రక్టర్, టీచింగ్ స్టాఫ్, ప్లేస్మెంట్ కోసం ప్రముఖ కంపెనీలతో టై అప్ కూడా అయ్యారు. అయితే ఇలాంటి మాటలు మనం ఎన్నైనా చెప్పుకోవచ్చు. కానీ, సగటు తల్లిదండ్రులకు మాత్రం అక్కడ తమ పిల్లలు ఎలా ఉంటారు అనే కంగారు అయితే ఉంటుంది. అందుకే ఆ యూనివర్సిటీ ఇప్పటి వరకు ఎవ్వరూ చేయని ఒక పని చేసింది.

ఈ మార్వాడీ యూనివర్సిటీ వాళ్లు తమ స్టూడెంట్స్ తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని నింపేందుకు ఏంకంగా ఒకేరోజు 600 మంది విద్యార్థులను, వారి తల్లిదండ్రులను క్యాంపస్ కి పిలిపించారు. అక్కడ మార్వాడీ యూనివర్సిటీ అవలంబించే విద్యా విధానం, అక్కడ విద్యార్థులకు అందిస్తున్న వసతులు, సౌకర్యాలు, ల్యాబ్స్, క్లాస్ రూమ్స్ అన్నీ చూపించారు. అలాగే వాళ్ల పిల్లలను ఒక మంచి యూనివర్సిటీలో చేర్పిచాం అనే నమ్మకాన్ని కలిగించారు. ఇలా సౌత్ ఇండియా నుంచి ఒక యూనివర్సిటీలో చేరేందుకు ఒకేరోజు 600 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు వెళ్లడం హిస్టరీలోనే ఇదే మొదటిసారి అంటూ యూనివర్సిటీ యాజమాన్యం కూడా వ్యాఖ్యానించింది.

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఎంతో మంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ వర్సిటీకి వెళ్లి ఒక మంచి యూనివర్సిటీలో చేర్పించాం అని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే మన దగ్గరున్న యూనివర్సిటీల కంటే చాలా తక్కువ ఫీజు అక్కడ ఉంది అని చెప్పారు. టీచింగ్, లెర్నింగ్, ఇన్ టర్న్ షిప్, ప్లేస్మెంట్ గురించి ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని.. మార్వాడీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆర్.బి.జడేజా భరోసానిచ్చారు. మీరు ఈ యూనివర్సిటీలో చేరాలి అనుకుంటే.. రాజ్ కోట్ వరకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 14 ప్రాంతాల్లో వాళ్ల ఆఫీసులు ఉన్నాయి. అక్కడి నుంచే అడ్మిషన్ తీసుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో పూర్తిగా చూసేయండి.

Show comments