Somesekhar
ప్రతీ సంవత్సరం నవమి రోజున సరిగ్గా మ.12 గంటలకు శ్రీ సీతారాముల వివాహం జరుతుంది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా?
ప్రతీ సంవత్సరం నవమి రోజున సరిగ్గా మ.12 గంటలకు శ్రీ సీతారాముల వివాహం జరుతుంది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా?
Somesekhar
శ్రీరామ నవమి.. భారతీయులకు అందులోనూ హిందువులకు ప్రత్యేకమైన పండుగ. దీంతో ఈ వేడుకను దేశవ్యాప్తంగా ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఇక ఏప్రిల్ 17(బుధవారం) నాడు జరుగుతున్న శ్రీరామ నవమిని హిందువులందరు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. తెలంగాణలోని భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. దీంతో పాటుగా దేశవ్యాప్తంగా ఉన్న రామాలయాల్లో శ్రీరామ నవమి రోజున శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అయితే ప్రతీ సంవత్సరం నవమి రోజున సరిగ్గా మ.12 గంటలకు సీతారాముల వివాహం జరుతుంది. దానికి కారణం ఏంటో మీకు తెలుసా? తెలీకపోతే తెలుసుకుందాం పదండి.
దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకులు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దేశంలో ఉన్న అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకించి హిందువులు రాములవారి కల్యాణాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. ఈ రోజున సీతారాములను ఎంతో భక్తి శ్రద్ధలతో తులసీ దళాలతో పూజిస్తారు. అయితే అందరిలో ఒక ప్రశ్న ఇప్పటికీ అలాగే మిగిలిపోయి ఉంది. అదేంటంటే? శ్రీ సీతారాముల కల్యాణం సరిగ్గా మ. 12 గంటలకే ఎందుకు చేస్తారని. దానికి కారణం లేకపోలేదు. ఆ రీజన్ ఏంటంటే?
శ్రీ రాముడు త్రేతాయుగంలో చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ ముహుర్తంలో సరిగ్గా మ. 12 గంటలకు జన్మించినట్లు పురణాలు చెబుతున్నాయి. దీంతో పాటుగా ఇంకో విశేషం కూడా ఉంది. ఇదే ముహూర్తాన రాముడు పట్టాభిషిక్తుడైయ్యాడు. పైగా రాముడు జన్మించిన రోజునే కల్యాణం జరిపించాలని పురాణగాథలు చెబుతున్నాయి. దాంతో అప్పటి నుంచి రాముడు పుట్టిన సమయాన్నే వివాహ సమయంగా నిర్ణయించిన వేదపండితులు ఏళ్లుగా ఇదే రోజున రాముల వారి కల్యాణం జరిపిస్తున్నారు. సరిగ్గా మ.12 గంటలకే శ్రీ సీతారాముల వారి కల్యాణం జరగడం వెనక ఇంత కథ ఉంది.