Vinayaka Chavithi 2023: ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్ళకండి! మహాపాపం!

ఈ పనులు చేసి.. వినాయకుడి మండపాల్లోకి వెళ్ళకండి! మహాపాపం!

హిందువులు పవిత్రంగా జరుపుకునే పండగల్లో వినాయక చవితి ఒకటి. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే చతుర్థి రోజున వినాయక చవితిని పండుగను జరుపుకుంటారు. గణాలకు అధిపతి అయిన వినాయకుడు జన్మించిన సందర్భంగా.. ఈ పండుగ జరుపుకుంటాము. తొమ్మిది రోజుల పాటు మండపాల్లో వినాయకుడిని కొలువు దీర్చి.. ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేసి.. ఆ తర్వాత.. ఎంతో ఘనంగా గణపయ్యను గంగమ్మ ఒడికి చేరుస్తాం. ఇక ఈ ఏడాది వినాయక చవితి పండుగ తేదీలో సందిగ్థత నెలకొంది. కొన్ని క్యాలెండర్లలో సెప్టెంబర్‌ 18న వినాయక చవితి అని ఉంటే.. కొన్నింటిల్లో సెప్టెంబర్‌ 19న పండగ అని ఉంది. కానీ పండితులు మాత్రం రెండు రోజుల్లో ఏ రోజైనా పండగ చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక తెలుగు రాష‍్ట్రాల్లో సెప్టెంబర్‌ 18నే వినాయక చవితి అని చెబుతున్నారు.

తెలుగు పంచాంగం ప్రకారం, వినాయక చవితి సెప్టెంబర్ 18న సోమవారం మధ్యాహ్నం 12:39 గంటలకు ప్రారంభమై, ఆ తర్వాతి రోజు అంటే మంగళవారం సెప్టెంబర్‌ 19, 2023 రాత్రి 8:43 గంటలకు ముగియనుంది. ఈ నేపథ్యంలో వినాయకుడి పూజ చేసుకోవడానికి శుభ సమయం 2:27 గంటల పాటు ఉంటుంది అంటున్నారు పండితులు. శుభ ముహుర్తంలో వినాయక విగ్రహాన్ని ఇంటికి తీసుకు రావాలి. తొలి పూజ చేసిన తర్వాత.. వీలును బట్టి 1, 3, 5, 9 రోజుల పాటు పూజా నియమాల ప్రకారం వినాయకుడి పూజ చేయాలి. ఆ తర్వాత నిమజ్జనం చేయాలి.

ఇక పండుగ అంటే ఎంతో పవిత్రంగా జరుపుకుంటాం. ఇక వినాయక చవితి అయితే ఏకంగా తొమ్మిది రోజుల పాటు జరుపుతాం. మండపాలు వేసి.. గణపతిని నిలిపి.. తొమ్మిది రోజులు ఎంతో నిష్టగా, పవిత్రంగా పూజలు చేస్తారు. వినాయక మండపాలను గుడితో సమానంగా భావిస్తారు. కనుక అంతటి పవిత్రమైన మండపంలోకి వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు పండితులు. మద్యం సేవించి వినాయక మండపంలోకి వెళ్లకూడదు అంటున్నారు. అలానే మాంసాహరం తిని మండపంలోకి వెళ్లకూడదు. చావు ఇళ్లను దర్శించి.. స్నానం చేయకుండా వినాయక మండపానికి వెళ్లకూడదు. అలానే ఇండ్లలో తలెత్తే కొన్ని పరిస్థితులను బట్టి కూడా మండపాలకు వెళ్లకపోవడే మంచిది అంటున్నారు పండితులు.

Show comments