Shravana Masam 2024: నేటి నుండి శ్రావణమాసం.. శుభకార్యాలన్నీ ఈ నెలలోనే ఉండటానికి కారణమిదే!

Shravana Masam 2024 Significance: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం మొదలయ్యింది. ఈ నెలలో పండగలు, వివాహాది శుభకార్యాలు పెద్ద ఎత్తున ఉంటాయి. మరి శుభకార్యాలన్నీ ఈ నెలలోనే ఉండటానికి కారణం ఏంటంటే..

Shravana Masam 2024 Significance: హిందువులు ఎంతో పవిత్రంగా భావించే శ్రావణమాసం మొదలయ్యింది. ఈ నెలలో పండగలు, వివాహాది శుభకార్యాలు పెద్ద ఎత్తున ఉంటాయి. మరి శుభకార్యాలన్నీ ఈ నెలలోనే ఉండటానికి కారణం ఏంటంటే..

తెలుగు పంచాగంలో ప్రతి నెలకు ఏదో ఒక ప్రాధాన్యత ఉంటుంది. మరీ ముఖ్యంగా శ్రావణం, కార్తీక మాసాలను హిందువులు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ రెండు నెలల్లో ఎన్నో శుభకార్యాలు జరుగుతుంటాయి. ఇక ఉగాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పండగలకు బ్రేక్‌ పడుతుంది. సుమారు మూడు నెలల పాటు శుభకార్యాలుండవు. శ్రావణ మాసం ప్రారంభం అయ్యాకే శుభకార్యాలు, పండగలు మొదలవుతాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలు శ్రావణ శోభతో అలరారుతాయి. అమ్మవారు, శివుడు, విష్ణువు ఆలయాలకు భక్తులు పొటేత్తుతారు. ఈ మాసంలో మహిళలు వరలక్ష్మీ వ్రతం, మంగళ గౌరీ వ్రతాలు చేస్తారు. అంతేకాక శివుడికి శ్రావణ సోమవారం రోజున ప్రత్యేక పూజలు చేస్తారు. మరి శ్రావణం మాసం ఎందుకింత ప్రత్యేకం అంటే..

చాంద్రమానం ప్రకారం తెలుగు మాసాలలో ఐదవ మాసం శ్రావణమాసం. పౌర్ణమి తిది రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు కనుక ఈ నెలకు శ్రావణ మాసం అని పేరు వచ్చిందని భావిస్తారు. అంతేకాక శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణా నక్షత్రమని.. అందుకే ఆ పేరు మీద దీనికి శ్రావణమాసం అనే పేరు వచ్చిందని మరో ప్రచారం ఉంది. విష్ణువు, ఆయన భార్య లక్ష్మీ దేవిలకు శ్రావణం అత్యంత ప్రీతికరమైనది. పైగా శ్రావణమాసంలోనే శ్రీకృష్ణుడు, హయగ్రీవ అవరాలు జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక శ్రావణమాసంలోనే సముద్ర మదనం చేశారని పురణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసానికి అంత విశిష్టత అని భావిస్తారు. అందుకే ఈ మాసంలో శివ కేశవులిద్దరిని అత్యంత భక్తి శ్రద్దలతో పూజిస్తారు. శ్రావణ సోమవారం, శ్రావణ మంగళవారం, శని వారం ఇలా నెలలో ప్రతి రోజూ ఎంతో విశిష్టత గలదే.

అంతేకాక ఈ నెలలో వ్రతాలు, నోములు, పూజలు చేస్తే.. సకల సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ నెలలో మరీ ముఖ్యంగా అమ్మవారిని కొలుస్తూ.. మహిళలు వ్రతాలు చేస్తారు. వీటిల్లో ముఖ్యమైంది వరలక్ష్మీ వ్రతం, మంగళగౌరి వ్రతం. జాతకంలో కుజదోశం ఉన్న వారు.. మంగళగౌరి వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయని అంటారు.  అలానే శ్రావణ సోమవారాలు శివారాధన చేసే వారిపై పరమేశ్వరుడి దయ, అనుగ్రహం ఉంటుందని నమ్ముతారు. అలానే శ్రావణ బుధవారాల్లో.. మహావిష్ణువును పూజించడం వల్ల ఆయన అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

ఇక మహిళలు ఎంతో భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం కూడా శ్రావణమాసంలోనే వస్తుంది. దీని గురించి స్కంధ పురాణంల ఉందని నమ్ముతారు. శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే.. జీవితంలో వచ్చే కష్టాలు, దుఃఖాలు, ఇబ్బందుల నుంచి బయటపడతామని నమ్మకం. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు, శుభకార్యాలకు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెబుతున్నాయి. అందుకే శ్రావణమాసంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇక ఈ మాసంలో రాఖీ పౌర్ణమి, నాగ పంచమి, శ్రావణ పూర్ణిమ, హయగ్రీవ జయంతి, కృష్ణాష్టమి వంటి పండుగలు వస్తాయి. అందుకే ఈ మాసానికి అంత ప్రత్యేకత అంటున్నారు పండితులు.

Show comments