Maha Shivaratri 2024: శివరాత్రికి తొలిసారి ఉపవాసం ఉంటున్నారా? అయితే ఈ నియమాలు తెలుసుకోండి!

హిందువులకు ఎన్ని పండుగలు ఉన్నా ఉపవాస, జాగరణలతో మిగతా వాటి కంటే శివరాత్రి పర్వదినం కొంత భిన్నంగా కనిపిస్తుంది. అలాంటి మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ నియమాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

హిందువులకు ఎన్ని పండుగలు ఉన్నా ఉపవాస, జాగరణలతో మిగతా వాటి కంటే శివరాత్రి పర్వదినం కొంత భిన్నంగా కనిపిస్తుంది. అలాంటి మహా శివరాత్రి రోజు ఉపవాసం ఉండాలని అనుకుంటున్నారా? అయితే ఈ నియమాలు తప్పక తెలుసుకోవాల్సిందే..

హోలీ, దసరా, దీపావళి, సంక్రాంతి అంటూ హిందువులకు చాలా పండుగలు ఉన్నాయి. అయితే ఎన్ని పర్వదినాలు ఉన్నప్పటికీ ఉపవాస, జాగరణలతో కూడి మిగతా అన్నింటి కంటే కొంత భిన్నంగా కనిపించే పర్వదినమే మహా శివరాత్రి. రాత్రిపూట పూజాధికాలు జరపడం లాంటివి ఈ పండుగ నాడు చూస్తాం. బిల్వపత్రార్చనలు, రుద్రాభిషేకాలు, రుద్రాక్ష మాలధారణలు, విభూతి ధారణలు శివరాత్రి నాడు శివయ్యకు ఇష్టమని భక్తులు చేస్తుంటారు. అదే సమయంలో రోజంతా నిష్టగా ఉపవాసం కూడా ఉంటారు. దీని వల్ల శివుడు తమ కోరికలన్నీ నెరవేరుస్తాడని నమ్ముతారు. అయితే మీరు కూడా మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటున్నారా? దీనికి సంబంధించిన కొన్ని నియమాలు తెలుసుకోండి..

  •  మహా శివరాత్రి నాడు ఉపవాసం ఉంటే ఒకేసారి మాత్రమే పండ్లు తినాలి. ఈ రోజు ఒక్కసారి మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి. అయితే గర్భిణులు లేదా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పండ్లను రెండు నుంచి మూడుసార్లు తినొచ్చని జ్యోతిష్యులు చెబుతున్నారు.
  • ఉపవాస సమయంలో పండ్లతో పాటు సింఘారా హల్వా, కుట్టు, సామ రైస్, బంగాళదుంపలు మొదలైనవి కూడా తినొచ్చు.
  • ఉపవాసం చేస్తున్నవారు గోధుమలు లేదా బియ్యాన్ని అసలే తినకూడదు. అలాగే ఈ రోజు తృణధాన్యాలతో చేసిన ఏ ఆహారాన్నీ తీసుకోకూడదు.
  • ఉపవాస సమయంలో ఉల్లి, వెల్లుల్లిని తినడం కూడా నిషేధం.
  • శివరాత్రి నాడు తెల్ల ఉప్పును తినకూడదు. దానికి బదులుగా రాక్ సాల్ట్​ను తీసుకోవచ్చు.
  • ఉపవాసం చేస్తున్నవారు ఎక్కువగా వేయించిన ఆహారాలను కూడా తినకూడదు. జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది కాబట్టి ఆ పదార్థాలు తీసుకోకూడదు.
  • ఉపవాస సమయంలో మాంసం, మద్యం జోలికి అస్సలు వెళ్లకూడదు.
  • శివరాత్రి ఉపవాసంలో ఉన్న భక్తులు అస్సలు నిద్రపోకూడదు.

ఇదీ చదవండి: మహా శివరాత్రి‌నాడు ఈ పొరపాట్లు చేయకండి!

Show comments