Lunar Eclipse 2023 Dont Do These Things: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయకండి

ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం.. ఈ పనులు అస్సలు చేయకండి

గ్రహణాలకు మన దగ్గర చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్టోబర్‌ 28, శనివారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. మరి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు వంటి వివరాలు..

గ్రహణాలకు మన దగ్గర చాలా ప్రాధాన్యత ఇస్తారు. అక్టోబర్‌ 28, శనివారం నాడు చంద్రగ్రహణం ఏర్పడనుంది. మరి గ్రహణ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. ఏం చేయాలి.. ఏం చేయకూడదు వంటి వివరాలు..

హిందూ మతంలో గ్రహణాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అంతేకాక గ్రహణాలను చెడుగా భావిస్తారు. గ్రహణ కిరణాలు తాకడం మంచిది కాదని నమ్ముతారు. అందుకే గ్రహణం విడిచేవరకు జనాలు బయటకు రారు. ఆలయాలను కూడా మూసి వేస్తారు. గ్రహణం విడిచిన తర్వాత సంప్రోక్షణ చేసి తిరిగి పూజలు ప్రారంభిస్తారు. ఇక గ్రహణ సమయంలో గర్భిణీలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. ఇక ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం అక్టోబర్ నెలలో శుక్లపక్షంలో శనివారం నాడు అనగా 28వ తేదీ నాడు ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం ఏర్పడనుంది.

అక్టోబర్‌ 28-29ల మధ్య అర్ధరాత్రి 1.06 నిమిషాల నుండి 2 గంటల 24 నిమిషాల వరకు చంద్రగ్రహణం ఏర్పడనుంది. భారతదేశం, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ తదితర దేశాలలో చంద్రగ్రహణం కనిపించనుంది. అయితే మన దేశంలో కేవలం పాక్షిక చంద్రగ్రహణం మాత్రమే ఏర్పడనుంది. అయితే ఈసారి ఏర్పడే చంద్రగ్రహణం రాహుగ్రస్త చంద్రగ్రహణం కావడంతో సూతక కాలాన్ని పాటించాలని చెబుతున్నారు పండితులు. చంద్రగ్రహణం ప్రారంభమయ్యే తొమ్మిది గంటల ముందు నుండి సూతక కాలాన్ని పాటించాలి.

సాధారణంగా శరద్ పూర్ణిమ నాడు గంగానదిలో స్నానం చేసి మహావిష్ణువును పూజించడం వల్ల భక్తుల బాధలన్నీ తొలగిపోతాయి అని నమ్ముతారు. ఇక ఈ ఏడాది చంద్రగ్రహణం శరద్ పూర్ణిమ నాడే ఏర్పడనుంది. అందువల్ల దీనికి మరింత ప్రాధాన్యత ఏర్పడనుంది. ఇక మనదేశంలో న్యూ ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, అహ్మదాబాద్, కోల్‌కతా మరియు వారణాసి వంటి కొన్ని ప్రముఖ నగరాలలో పాక్షిక చంద్రగ్రహణం కనిపిస్తుంది. పిల్లలు, వృద్దులు, అనారోగ్యంతో బాధపడే వారికి సూతక కాలం 28వ తేదీ రాత్రి 8 గంటల 52 నిమిషాలుగా చెబుతున్నారు.

ఏమి చేయకూడదు?

  • చంద్రగ్రహణం సమయంలో మర్చిపోయి కూడా దేవుళ్ల విగ్రహాలను, పూజా వస్తువులను కూడా తాకకూడదు.
  • గ్రహణం సమయంలో పదునైన వస్తువులను అంటే చాకులు, బ్లేడు, కత్తెరలు వంటి వాటిని ఉపయోగించకూడదు.
  • గర్భిణీ స్త్రీలు కత్తెర, కత్తులు, సూదులు మొదలైన వాటిని ఉపయోగించడం మంచిది కాదు.
  • ఇతరులతో పోలిస్తే గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటి పనులు చేయకూడదు.
  • ఇక గ్రహణ సమయంలో ఆహారం తినకూడదు అంటారు.
  • అంతేకాక గ్రహణం సమయంలో ఎవరిపైనా ద్వేషం పెంచుకోకండి. ఎవ్వరి మనస్సును గాయపర్చకండి.
  • చంద్రగ్రహణం సమయంలో శ్మశానాలు, ప్రతికూల ప్రదేశాలకు వెళ్లకూడదు.
Show comments