Dharani
Hanuman Jayanti 2024: ఆంజనేయుడికి సంబంధించి అతి ముఖ్యమైన పర్వదినం హనుమాన్ జయంతి. ఏప్రిల్ 23న ఈ పర్వదినం వచ్చింది. మరి ఈ రోజు ఏం చేయాలి.. శుభ ముహుర్తం ఎప్పుడు ఉంది.. పూజా విధానం ఏంటి వంటి వివరాలు మీ కోసం
Hanuman Jayanti 2024: ఆంజనేయుడికి సంబంధించి అతి ముఖ్యమైన పర్వదినం హనుమాన్ జయంతి. ఏప్రిల్ 23న ఈ పర్వదినం వచ్చింది. మరి ఈ రోజు ఏం చేయాలి.. శుభ ముహుర్తం ఎప్పుడు ఉంది.. పూజా విధానం ఏంటి వంటి వివరాలు మీ కోసం
Dharani
చిన్నారులు మొదలు పెద్దల వరకు అందరికి ఇష్టుడు ఆంజనేయుడు. పిల్లలకు ధైర్యం చెప్పడానికి, వారికి పీడకలలు రాకుండా చూసుకునేందుకు గాను.. రాత్రి పడుకునే ముందు జై హనుమాన్ అని స్మరించుకోమని చెబుతారు తల్లిదండ్రులు. ఇక ప్రతి ఏటా చాలా మంది భక్తులు హనుమాన్ దీక్ష తీసుకుంటారు. శ్రీరాముడికి పరమ భక్తుడైన హనుమంతుడిని ఆరాధిస్తే.. సకల పాపాలు తొలగిపోతాయి అని నమ్ముతారు. ఇక మారుతీకి సంబంధించి నిర్వహించే పండుగల్లో అతి ముఖ్యమైంది హనుమాన్ జయంతి. ఆంజనేయుడి పుట్టినరోజు పండుగ అన్నమాట. హిందూ పురాణాల ప్రకారం, ఛైత్ర మాస శుద్ధ పౌర్ణమి రోజున హనుమంతుడు జన్మించాడని చెబుతారు. ప్రతి ఏటా ఆ రోజున మన దేశంలో ఎంతో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా భాగ్యనగరంలో.. హనుమాన్ జయంతి నాడు.. భారీ ర్యాలీలు, శోభయాత్రలు నిర్వహిస్తారు.
ఇక ఈ ఏడాది ఏప్రిల్ 23, మంగళవారం నాడు హనుమాన్ జయంతి వచ్చింది. ఆంజనేయుడికి ఎంతో ఇష్టమైన మంగళవారం నాడు హనుమాన్ జయంతి రావడం విశేషం. ఈ పవిత్రమైన రోజున భక్తులు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. అంతేకాక హనుమాన్‌కి బూందీ, లడ్డూ, హల్వా వంటి తియ్యని వస్తువులను సమర్పించి ఆంజనేయుడి ఆశీస్సులు పొందుతారు. మరి రేపే హనుమాన్ జయంతి. ఈ క్రమంలో ఈ పండుగ ప్రాముఖ్యత, పూజా విధానాలు, చేయాల్సిన పనుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
హిందూ పంచాంగం ప్రకారం, ఈ ఏడాది హనుమాన్ జయంతి అయిన ఛైత్ర మాస పౌర్ణమి తిథి ఏప్రిల్ 23 అనగా మంగళవారం తెల్లవారుజామున 3:25 గంటలకు ప్రారంభమయ్యి.. మరుసటి రోజు అంటే 24 ఏప్రిల్ 2024 ఉదయం 5:18 గంటలకు ముగుస్తుంది. సాధారణంగా హిందూ పండగలను ఉదయం తిథి ప్రకారమే చేసుకుంటారు. కనుక మంగళవారం అనగా.. ప్రిల్ 23వ తేదీనే హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు. ఈ పవిత్రమైన రోజున ఉదయం 3:25 గంటల నుంచి ఉదయం 5:18 గంటల మధ్య హనుమాన్ పూజ చేయాలని.. హనుమాన్ జయంతి నాడు ఈ రెండు గంటలే కీలకమని.. ఈ సమయంలో ఆంజనేయుడికి పూజ చేస్తే.. మీ తలరాత మారుతుంది అంటున్నారు పండితులు.
ఈ ఏడాది హనుమాన్ జయంతి మంగళవారం నాడు రావడంతో ఈ పండుగ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది. పైగా ఈ రోజంతా చిత్రా నక్షత్ర ప్రభావం ఉంటుంది. చిత్రా నక్షత్రానికి కుజుడు అధిపతిగా ఉంటాడు. హనుమాన్ జయంతి రోజునే అంగారకుడు మీన రాశిలో సంచారం చేయనున్నాడు. ఈ సమయంలో హనుమంతుడిని పూజిస్తే అన్ని కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆకస్మిక సంక్షోభం, ఆరోగ్య సమస్యలు, మరణ భయం వంటివన్నీ తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
గమనిక: ఇవి కేవలం పండితుల అభిప్రాయాలు మాత్రమే. దీనితో ఐడ్రీమ్ మీడియాకు ఎలాంటి సంబంధం లేదు.