దసరా ప్రత్యేకం పాలపిట్ట.. విజయదశమి రోజున ఎందుకు చూస్తారో తెలుసా?

Dasara 2024 Indian Roller: దసరా వేడుకలను అంగరంగ వైభవంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు. పాలపిట్టలకు అంతటి ప్రత్యేకత ఎందుకు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

Dasara 2024 Indian Roller: దసరా వేడుకలను అంగరంగ వైభవంగా ప్రజలు సిద్ధమవుతున్నారు. అయితే విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారు. పాలపిట్టలకు అంతటి ప్రత్యేకత ఎందుకు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పంగల్లో దసరా ఒకటి. తెలుగు ప్రజలకు దసరా అతిపెద్ద పండగ. ఇప్పటికే దసరా పండగ సందడి షురువైంది. ఇంకో రెండు రోజుల్లో విజయదశమిని ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఉద్యోగ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంతూళ్లకు పయనమవుతున్నారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్స్ దసరాకు ఊరెళ్లే వారితో కిక్కిరిసిపోతున్నాయి. కుటుంబ సభ్యులతో కలిసి దసరా వేడుకలను జరుపుకునేందుకు ప్రజలు రెడీ అవుతున్నారు. కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో అంగరంగ వైభవంగా దసరా వేడుకలను జరుపుకుంటుంటారు. విజయదశమి రోజున అంతా ఒక్కచోట చేరి ఆనందంగా గడుపుతుంటారు.

విజయానికి ప్రతీక అయిన దసరా పండగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. అయితే దసరా పండగ అనగానే టక్కున గుర్తొచ్చేది రావణ దహనాలు. విజయదశమి రోజున దేశవ్యాప్తంగా రావణాసురున్ని దహనం చేస్తుంటారు. చిన్నలు, పెద్దలు అంతా కలిసి రావణ దహనంలో పాల్గొంటుంటారు. ఊరంతా ఒక్కచోట చేరి రావణున్ని దహనం చేస్తుంటారు. విజయానికి ప్రతీక అయిన దసరా రోజున మరో ప్రత్యేకత ఏంటంటే పాలపిట్టను చూడడం. విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకుంటారు. ఈ ఆచారం ఎన్నో ఏండ్లుగా వస్తున్న ఆనవాయితీ. దసరా రోజు శమీ పూజ అనంతరం ప్రజలు పాలపిట్టను దర్శించుకుంటారు. జమ్మి చెట్టు వద్దకు చేరుకుని పూజలు చేసి పాలపిట్ట దర్శనం కోసం చూస్తుంటారు.

పాలపిట్టను చూసేందుకు పంట పొలాలు, చెరువుగట్ల వద్దకు ఊరంతా కదిలి వెళ్తుంది. అందుకే దసరా పండుగకు పాలపిట్టకు విడదీయరాని అనుబంధం ఉందంటుంటారు. మరి దసరా రోజునా పాలపిట్టను చూడడానికి గల కారణం ఏంటీ? పాలపిట్ట అంతటి ప్రత్యేకతను ఎందుకు సంతరించుకుంది? విజయదశమి రోజున పాలపిట్టను ఎందుకు చూస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. ద‌స‌రా రోజు పాలపిట్ట‌క‌నిపిస్తే ప్రజలు శుభ‌సూచకంగా భావిస్తారు. నీలం, ప‌సుపు రంగుల క‌ల‌బోత‌లో ఉండే పాలపిట్ట‌ చూసేందుకు ఎంతో అందంగా ఆకర్షవంతంగా ఉంటుంది. పాలపిట్ట‌ మ‌న‌శ్శాంతికి, ప్ర‌శాంత‌త‌కు, కార్య‌సిద్ధికి సంకేతంగా భావిస్తారు. చాలామంది ఈ ప‌క్షిని ప‌ర‌మేశ్వ‌రుడి స్వ‌రూపంగా భావిస్తుంటారు. అందుకే ద‌స‌రా పండుగ రోజు పాలపిట్ట‌ను చూస్తే అన్ని శుభాలే జ‌రుగుతాయ‌ని విశ్వసిస్తుంటారు.

అయితే ఈ న‌మ్మ‌కం వెనుక పురాణ‌గాథ‌లు అనేకం ప్రాచుర్యంలో ఉన్నాయి. త్రేతా యుగంలో రావ‌ణాసురుడితో శ్రీరాముడు యుద్ధానికి బ‌య‌లుదేరిన‌ప్పుడు విజ‌య ద‌శ‌మి రోజున పాలపిట్ట‌ ఎదురుగా క‌నిపిస్తుంది. ఆ త‌ర్వాత జ‌రిగిన యుద్ధంలో రాముడు విజ‌యం సాధిస్తాడు. దీంతో పాలపిట్ట‌ను రాముడు శుభ‌శ‌కునంగా భావించాడ‌ని పురాణాలు చెబుతున్నాయి. ఇక అజ్ఞాత వాసానికి ముందు పాండ‌వులు జ‌మ్మి చెట్టు మీద దాచిన ఆయుధాల‌ను ఇంద్రుడు పాల‌పిట్ట రూపంలో కాపాలా కాశాడని పురాణ గాథ‌లు చెబుతున్నాయి. అంతేకాదు పాండ‌వులు అర‌ణ్య‌, అజ్ఞాత వాసాల‌ను అనుభవించిన విషయం తెలిసిందే. పాండవులు దీన్ని ముగించుకుని తిరుగు ప్ర‌యాణ‌మై త‌మ రాజ్యానికి వెళ్తున్న స‌మ‌యంలో పాలపిట్ట‌ ద‌ర్శ‌న‌మిచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

అప్ప‌టి నుంచి వారి క‌ష్టాలు తొల‌గిపోయాయి. కురుక్షేత్ర సంగ్రామంలో విజ‌యం సాధించ‌డంతో పాటు పోగొట్టుకున్న రాజ్యాన్ని తిరిగి పొందారు. పాలపిట్ట‌ క‌నిపించిన‌ప్ప‌టి నుంచి పాండ‌వులు ఏం చేసినా విజ‌యాలే క‌లిగాయాని శాస్త్రాలు వెల్లడిస్తున్నాయి. అందుకే ద‌స‌రా రోజు పాల‌పిట్ట‌ను చూస్తే శుభాలు క‌లుగుతాయ‌ని ప్ర‌జ‌ల ప్రగాఢ న‌మ్మ‌కం. అందుకే విజ‌య ద‌శ‌మి రోజు సాయంత్రం జ‌మ్మి పూజ త‌ర్వాత ప్ర‌జ‌లు పాలపిట్ట‌ ద‌ర్శ‌నం కోసం వెళ్తుంటారు. పాలపిట్ట దర్శనం అనంతరం ఇళ్లకు చేరుకుంటారు. పురాణాలు, సాంస్కృతిక ప‌రంగా పాలపిట్ట‌కు ఇంత‌టి ప్రాధాన్యం ఉంది. అందుకే దసరా రోజు పాలపిట్టను దర్శించుకుంటారు. మరి విజయదశమి రోజున పాలపిట్టను దర్శించుకోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments