చేసిన అప్పు తీర్చలేక బలవన్మరణానికి పాల్పడ్డ యువకుడు!

తెలంగాణలో విషాదం చోటు చేసుకుంది. చేసిన అప్పులు తీర్చలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడి కన్నవారికి కన్నీటి శోకాన్ని మిగిల్చాడు. ఈ విషయం తెలుసుకుని మృతుని కుటుంబ సభ్యులు గుండెలు పగిలేలా ఏడ్చారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా దౌల్తాబాద్ పరిధిలోని ఇంద్రుప్రియల్ గ్రామంలో తోట కుమార్ (36) అనే యువకుడు నివాసం ఉంటున్నాడు. ఇతడు స్థానికంగా చాలా కాలంగా ఓ దాబాను నడిపిస్తున్నాడు.

అయితే కుమార్ దాబా నిర్వహణలో భాగంగా భారీగా డబ్బు అప్పు చేసినట్లుగా తెలుస్తుంది. చేసిన అప్పు రోజు రోజుకు మిత్తితో పాటు పెరుగుతూ వస్తుంది. దీంతో కుమార్ కు ఏం చేయాలో అస్సలు అర్థం కాలేదు. ఇక తీసుకున్న అప్పు ఎలా తీర్చాలో తెలియక ఆ యువకుడు తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు. ఇక చేసేదేం లేక కుమార్ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. ఇందులో భాగంగానే గురువారం రాత్రి దాబాలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఇక ఫలితం లేకపోవడంతో కుమార్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. అతని మరణంతో మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు గుండెలు పగిలేలా ఏడ్చారు. ఆ తర్వాత ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా చోటు చేసుకున్న ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. చేసిన అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకున్న కుమార్ నిర్ణయంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది కూడా చదవండి: హైదరాబాద్ లో మరోసారి హల్ చల్ చేసిన చెడ్డీ గ్యాంగ్

Show comments