Venkateswarlu
Venkateswarlu
బెంగళూరులో చోటుచేసుకున్న డబుల్ మర్డర్ కేసుకు సంబంధించి పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. పోలీసుల విచారణలో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రైవేట్ బ్రాడ్ బాండ్ కంపెనీ ఉద్యోగులు ఫనీంద్ర సుబ్రమణ్య, విను కుమార్‌ల హత్య కేసులో మరో అనుమానితుడ్ని గుర్తించారు. బెంగళూరుకు చెందిన ‘జోకర్ ఫీలిక్స్’కు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్నారు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పెట్టిన పోస్టులు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఈ రెండు హత్యలు జరిగిన కొన్ని గంటలకే అతడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్టులో.. డబుల్ మర్డర్ల గురించిన న్యూస్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేశాడు. మరో పోస్టులో ‘‘ ఈ విశ్వంలోని ప్రజలందరూ పొగిడేవాళ్లు.. మోసగాళ్లు.. అందుకే నేను ఈ విశ్వంలోని ప్రజలని ఇబ్బంది పెడతా.. నేను కేవలం చెడ్డ వాళ్లను మాత్రమే ఇబ్బంది పెడతా.. నేను మంచి వాళ్లను ఎప్పుడూ ఏమీ చేయను’’ అని రాసుకొచ్చాడు. దీంతో పోలీసులకు జోకర్ ఫీలిక్స్‌పై అనుమానం పెరిగింది. అతడే ఈ రెండు హత్యలు చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు.
పోలీసులు అతడి ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతడి పూర్తి ఏదో తెలియకపోవటంతో.. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఛానళ్లకు ఉన్న పేరునే అతడి పేరుగా పేర్కొన్నారు. ఫీలిక్స్ హాలీవుడ్‌లో వచ్చిన జోకర్ సినిమా స్ఫూర్తితో ఈ హత్యలు చేస్తూ ఉండొచ్చని భావిస్తున్నారు. ఫీలిక్స్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరారీలో ఉన్న వీరి కోసం అన్వేషణ ప్రారంభించారు. మరి, ఈ డబుల్ మర్డర్‌లకు, జోకర్ ఫీలిక్స్‌కు సంబంధం ఉందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.