Vinay Kola
Scam Alert: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెక్నాలజీ వినియోగం వేగంగా పెరిగిపోతుంది. అందువల్ల చాలా రకాల పనులు సింపుల్ గా జరిగిపోతున్నాయి. వీటితో పాటు సైబర్ స్కాములు కూడా పెరిగిపోతునాయి.
Scam Alert: టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెక్నాలజీ వినియోగం వేగంగా పెరిగిపోతుంది. అందువల్ల చాలా రకాల పనులు సింపుల్ గా జరిగిపోతున్నాయి. వీటితో పాటు సైబర్ స్కాములు కూడా పెరిగిపోతునాయి.
Vinay Kola
ప్రస్తుతం టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని రంగాల్లో టెక్నాలజీ వినియోగం వేగంగా పెరిగిపోతుంది. అందువల్ల చాలా రకాల పనులు చాలా ఈజీగా అయిపోతున్నాయి. గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరక్కుండానే పనులన్నీ సింపుల్ గా జరిగిపోతున్నాయి. వీటితో పాటు సైబర్ స్కాములు కూడా విచ్చల విడిగా పెరిగిపోతునాయి. ప్రజల అవసరాలను అలుసుగా తీసుకుంటున్నారు సైబర్ స్కామర్లు. ఎన్నో రకాల మోసాలు చేస్తున్నారు. బాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తున్నారు. తాజాగా మరో స్కామ్ కి పాల్పడుతున్నట్లు తెలుస్తుంది. ఆ స్కామ్ ఏంటి? ఎలా మోసం చేస్తారు? ఈ స్కామ్ బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దేశంలో చాలా మంది ఫించన్ దారులు ఉంటారు. వారిని టార్గెట్ గా చేసుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ అనేది పెన్షనర్లకు చాలా ముఖ్యమైన డాక్యుమెంట్. దానిని తమకు పంపాలంటూ వాట్సాప్ లో నకిలీ మెసేజ్ లు పంపుతున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించింది. చాలా జాగ్రత్తగా ఉండాలని పింఛన్ లబ్ధిదారులకు సూచిందింది.పెన్షన్ తీసుకునే వారందరూ కూడా ఏడాదికోసారి జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాలి. అలా చేయలేకపోతే వారికి ప్రతి నెలా వచ్చే పింఛన్ ఆగిపోతుంది. ప్రతి ఏడాది నవంబర్ లో వీటిని అందజేయాలి. అయితే స్కామర్లు ఈ విషయాన్నిగుర్తించారు. మోసాలకు పాల్పడుతున్నారు. పెన్షనర్ల వాట్సాప్ నంబర్ల డేటాని వివిధ మార్గాలలో కలెక్ట్ చేసుకొని వారికి ఫేక్ మెసేజీలు పంపిస్తున్నారు. జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ ని అప్ డేట్ చేసుకోవాలని లింక్ లను పంపిస్తునారు. ఆ లింకులు ఓపెన్ చేయగానే వారి పర్సనల్ డీటైల్స్ ని యాక్సెస్ చేస్తున్నారు. ఆ లింక్ లో కోరిన సమాచారం ఇవ్వకపోతే పింఛన్ ఆగిపోతుందని స్కామర్లు భయపెడుతున్నారు.
సైబర్ స్కామర్లు ముందుగా పింఛన్ దారుల వాట్సాప్ నంబర్ కు తాము ప్రభుత్వ అధికారులమని ఫేక్ మెసేజ్ పంపుతారు. పింఛన్ దారుల జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ ఎక్స్పైరీ డేట్ ఐపోయిందని, కొత్తది ఇవ్వాలని అడుగుతారు. అలా ఇవ్వకుంటే పింఛన్ రాదని భయపెడతారు. ఒక లింక్ ను పంపుతారు. దానిలో వారు కోరిన వివరాలని ఎంటర్ చేయాలని అడుగుతారు. దానిలో మీ పీపీవో నంబర్, పర్సనల్ డీటైల్స్, బ్యాంక్ అకౌంట్ డీటైల్స్ ఫిల్ చేయాలని అడుగుతారు.పొరపాటున ఆ వివరాలన్నీ కూడా ఎంటర్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్ హాక్ అవుతుంది. స్కామర్లు మీ ఖాతాలోని డబ్బులను ఈజీగా దొంగిలించేస్తారు. కాబట్టి కచ్చితంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా జీవన్ ప్రమాణ్ డాక్యుమెంట్ లను వాట్సాప్ ద్వారా పంపే ఛాన్సే లేదు. అలా పంపించాలని అధికారులెవ్వరూ కూడా అడగరు. కాబట్టి ఇలాంటి ఫేక్ మెసేజ్ లు వస్తే అస్సలు నమ్మకూడదు. ముఖ్యంగా ఇలాంటి లింక్ లపై అస్సలు క్లిక్ చేయకూడదు. వాట్సాప్ ద్వారా బ్యాంక్ ఖాతా వివరాలు, పీపీవో నంబర్, వ్యక్తిగత సమాచారం అసలు ఎవరికి పంపకూడదు. కేవలం అధికార వెబ్ సైట్ లను మాత్రమే సందర్శించాలి. లేకపోతే అధికారిక సీపీఏవో వెబ్ సైట్ ను సందర్శించాలి. ఇలాంటి ఫేక్ మెసేజ్ లు వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ (ఎన్సీఆర్పీ)కి ఫార్మార్డ్ చేయాలి. లేకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.