Arjun Suravaram
HDFC: ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. కొత్త మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. నిరక్ష్యరాసుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు అందరూ ఈ కేటుగాళ్లు ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
HDFC: ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. కొత్త మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. నిరక్ష్యరాసుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు అందరూ ఈ కేటుగాళ్లు ఉచ్చులో చిక్కుకుంటున్నారు.
Arjun Suravaram
ప్రస్తుత కాలంలో అడ్డదారుల్లో డబ్బులు సంపాదించే వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. ముఖ్యంగా సామాన్య ప్రజలను మోసం చేస్తూ..వారి నుంచి అందిన కాడికి దోచుకుంటున్నారు. మరోవైపు సైబర్ కేటుగాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. రకరకాల మార్గాల్లో ప్రజల నుంచి డబ్బులను దొంగిలిస్తున్నారు. ప్రభుత్వాలు, పోలీసులు ఎంత అప్రమత్తం చేసినా.. కొత్త మార్గాల్లో సైబర్ కేటుగాళ్లు విరుచుకుపడుతున్నారు. నిరక్ష్యరాసుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగాలు చేస్తున్న వారి వరకు అందరూ ఈ కేటుగాళ్లు ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే హెచ్ డీఎఫ్ సీ బ్యాక్ కస్టమర్లకు ఓ కీలక అలెర్ట్ వచ్చింది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్న
హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ అధికారులమంటూ నేరగాళ్లు వాట్సాప్ లో మెసేజ్ లు పంపిస్తున్నారు. ఏపీకే ఫైల్ పంపించి ఇన్ స్టాల్ చేయాలని సూచిస్తున్నారు. తెలియక దానిపై క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ హ్యాక్ అయి అందులోని డబ్బులు ఖాళీ అవుతున్నాయి. తాజాగా ఓ వ్యక్తి రూ.74 వేలు పోగొట్టుకున్నాడు. హెచ్ డీ ఎఫ్ సీ బ్యాంక్ అధికారులంటూ గుర్తు తెలియని నెంబర్ నుంచి ఓ లింక్ పంపారు. అయితే వారి మాటలు ఓ హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ కస్టమర్ నమ్మడు. వారు పంపిన ఏపీకే ఫైల్ పై క్లిక్ చేశాడు. ఇక కాసేపటికే అతడి బ్యాంక్ ఖాతాలో నుంచి రూ.74 వేలు కట్ అయ్యాయి. డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ రావడంతో బాధితుడు షాకయ్యాడు. సైబర్ కేటుగాళ్లు పంపిచిన ఫైల్ ను క్లిక్ చేయడంతోనే తన డబ్బులు పోయినట్లు గుర్తించాడు. దీంతో వెంటనే స్థానిక సైబర్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేపట్టారు.
ఇది ఇలా ఉంటే..ఇలాంటి ఏపీకే ఫైల్స్ అస్సలు ఓపెన్ చేయవద్దని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ఇలా గతంలో పలు బ్యాంకుల పేరుతో సైబర్ నేరగాళ్లు వివిధ పైల్స్ పంపించారు. చాలా మంది నుంచి భారీగా డబ్బులను చోరీ చేశారని తెలిపారు. ఏపీకే ఫైల్ పంపించి.. అకౌంట్ హ్యాక్ చేయడం కొత్తేమి కాదు. ఇప్పటికే హెచ్ డీఎఫ్ సీ లాంటి ఇతర ప్రముఖ బ్యాంకుల కస్టమర్లకు కూడా ఇలాంటి ఫైల్స్ వెళ్లాయి. కొందరు జాగ్రత్తగా ఉండటంతో సైబర్ కేటుగాళ్లకు చిక్కలేదు. ఇది ఇలా ఉంటే..ఎవ్వరైనా సరే..గుర్తు తెలియని నెంబర్ల నుంచి, సైట్ల నుంచి ఏమైనా లింక్స్ వచ్చిన ఓపెన్ చేయకపోవడం మంచిది. అలానే ఎవరైనా ఫోన్ చేసి.. వివిధ మార్గాల్లో డబ్బు ప్రలోభాలు పెడితే..అలాంటి వాటికి దూరంగా ఉండటం మంచిది. సైబర్ నేరగాళ్లు ఏ మార్గాల్లో అటాక్ చేస్తారో తెలియదు కాబట్టి..నిరంతరం అప్రమత్తంగా ఉండటం మంచిది