గదిలో రక్తం, బీర్లు, సిగరెట్లు! గచ్చిబౌలిలో యువతి మృతిపై భయంకరమైన అనుమానాలు!

Gachibowli, Red Stone Hotel, Nursing Student, Hyderabad: ఓ హోటల్‌ గదిలో నర్సింగ్‌ విద్యార్థి మృతి కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత.. ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..

Gachibowli, Red Stone Hotel, Nursing Student, Hyderabad: ఓ హోటల్‌ గదిలో నర్సింగ్‌ విద్యార్థి మృతి కేసులో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పోస్టుమార్టం తర్వాత.. ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి..

హైదరాబాద్‌ మహానగరంలో నర్సింగ్‌ విద్యార్థి మృతిపై భయంకరమైన అనుమానలు వ్యక్తం అవుతున్నాయి. నగరంలోని గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఈ రోజు(సోమవారం) ఉదయం ఓ గదిలో శృతి అనే అమ్మాయి ఫ్యాన్‌కి వేలాడుతూ.. ఉరి వేసుకొని చనిపోయినట్లుగా కనిపించింది. తొలుత ఆత్మహత్య అనుకున్నప్పటికీ.. ఈ కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రాథమిక విచారణ ఆధారంగా.. జడ్చర్లకు చెందిన శృతి(23) గచ్చిబౌలి చిన్న అంజయ్య నగర్‌లోని రెడ్‌స్టోన్ హోటల్‌లో గత రాత్రి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.

కానీ, యువతి ఉన్న హోటల్‌ గదిలో రక్తపు మరకలతో పాటు బెడ్‌ కింద మూడు బీర్‌ సీసాలు, కాచ్చిపడేసిన 30 సిగరెట్లు, ఓ వాటర్ బాటిల్, చిప్స్ ప్యాకెట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో.. తమ కూతురిది ఆత్మహత్య కాదని, ఎవరో దారుణంగా అత్యాచారం చేసి, హత్య చేసి ఉంటారని మృతురాలి తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హోటల్‌ గదిలో ఉన్న పరిస్థితి చూస్తుంటే.. అక్కడే ఏదో అనుమానస్పదంగా జరిగినట్లు అర్థం అవుతుందని పోలీసులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శృతి ఆ హోటల్‌కు ఎప్పుడు వచ్చింది? ఎవరితో వచ్చింది? ఆమెతో పాటు గదిలో ఎవరున్నారు? గదిలో ఉరేసుకున్నట్లు పోలీసులకు కానీ, హోటల్‌ మేనేజ్‌మెంట్‌కు కానీ సమాచారం ఎవరు అందించారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

హోటల్‌ గదిలో రక్తపు మరకలు కనిపించడంతో ఆమెపై అత్యాచారం జరిగినట్లు మృతురాలి కుటుంబ సభ్యులు బలంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది కచ్చితంగా ఆత్మహత్య అయితే కాదని.. కచ్చితంగా దారుణం జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. కాగా.. జడ్చర్లకు చెందిన శృతి.. గతంలో యశోద హాస్పిటల్‌లో ట్రైనీ నర్సుగా పనిచేసిన సమాచారం. కొంతకాలం యశోద ఆస్పత్రిలో ఉద్యోగం మానేసి ఇంటికి వెళ్లిపోయి, మళ్లీ తిరిగి ఇటీవలే నగరానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరో ఉద్యోగం వెతుక్కునే వేటలో ఉన్నట్లు సమాచారం. సిటీకి జాబ్‌ చేసుకునేందుకు వచ్చిన తమ కూతురు ఇలా అయిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. ఈ కేసుకు సంబంధించిన మరిన్ని విషయాలు.. పోస్టుమార్టం రిపోర్టుతో బయటపడే అవకాశం ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments