Fire Accident-Johannesburg: బ్రేకింగ్‌: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవదహనం

బ్రేకింగ్‌: అపార్ట్‌మెంట్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 52 మంది సజీవదహనం

పండుగపూట వరుస అగ్ని ప్రమాదాలు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. బుధవారం అర్థరాత్రి.. ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం.. శ్రీశైలంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆలయ ప్రాంగణంలోని సుమారు 15 షాపులు దగ్దం అయ్యాయి. షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ప్రమాదం చోటు చేసుకుందని భావిస్తున్నారు. అర్థరాత్రి సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడం వల్ల.. ప్రాణనష్టం సంభవించలేదని.. కానీ కోట్ల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా మరో చోట అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 52 మంది సజీవ దహనం అయ్యారు. ఆ వివరాలు..

అయితే ఈ దారుణ ప్రమాదం చోటు చేసుకుంది మన దగ్గర కాదు. దక్షిణిఫ్రికాలో గురువారం తెల్లవారుజామున ఈ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. జోహన్నెస్‌బర్గ్‌లోని ఐదు అంతస్తుల అపార్ట్‌మెంట్‌లో గురువారం ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సుమారు 52 మంది సజీవ దహనం అయ్యారని అధికారులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే.. సహాయక సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాద సమయంలో భవనంలో సుమారు 200 మంది ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Show comments