Krishna Kowshik
మామయ్య అన్న పిలుపుకోసం పరితపించిపోతాడు మేనమామ. సోదరి పిల్లలతో అతడికి ఉండే బాండింగ్ వేరు. అమ్మనాన్నల దగ్గర లేని చనువు.. మేనమామల దగ్గర ఉంటుంది మేనకోడలు, అల్లుళ్లకి. కానీ ఈ మేనమామ మాత్రం..
మామయ్య అన్న పిలుపుకోసం పరితపించిపోతాడు మేనమామ. సోదరి పిల్లలతో అతడికి ఉండే బాండింగ్ వేరు. అమ్మనాన్నల దగ్గర లేని చనువు.. మేనమామల దగ్గర ఉంటుంది మేనకోడలు, అల్లుళ్లకి. కానీ ఈ మేనమామ మాత్రం..
Krishna Kowshik
తండ్రి బంధువల కన్నా తల్లి తరఫు చుట్టరికాలు ఎక్కువగా ఉంటాయి పిల్లలకు. అందుకే హాలీడేస్ రాగానే.. పిట్టల్లా రాలిపోతుంటారు అమ్మ పుట్టింట్లో. ఇక అమ్మకు సోదరుడు ఉండే.. ఆ చనువే వేరు. అక్కా/చెల్లెలు పిల్లలు వచ్చారని సంబరపడిపోతుంటాడు మేనమామ. సెలవులన్నీ అమ్మమ్మ చేసిన వంటలు తిని.. మేనమామతో ఊరంతా చుట్టి వస్తుంటారు. మావయ్య అని మనసారా పిలిచి.. ఏదైనా అడగాలే కానీ.. కొండమీద కోతినైనా పట్టుకొస్తుంటారు. ఇక మేన కోడలు అయితే.. మామ మీద చనువుతో దబాయించి మరీ కోరికల చిట్టా విప్పుతుంది. అన్నాదమ్ముల తర్వాత ఆడపిల్ల గిల్లికజ్జాలు పెట్టుకునేది మేనమామతోనే. కానీ ఈ మేనమామ మాత్రం దుర్మార్గుడు. కూతురిలాంటి మేనకోడలిపై కన్నువేశాడు. పెళ్లి చేసుకోవాలనుకున్నాడు.
అక్కా, బావను కూడా ఒప్పించాడు. కానీ మామయ్యను చేసుకోవడం ఇష్టం లేని మేనకోడలు.. తన తల్లిదండ్రులకు చెప్పింది. తనను కాదన్నందుకు కోడలిపై అక్కసు పెంచుకున్న దుర్మార్గుడు.. అంతమొందించాడు. ఈ విషాద ఘటన కర్ణాటకలోని హావేరి జిల్లా హనగల్ తాలూకాలో జరిగింది. వివరాల్లోకి వెళితే బైచవళ్లి గ్రామానికి చెందిన దీపకు 21 సంవత్సరాలు. ఆమెకు మేనమామ మాలతేశ బార్కి ఉన్నాడు. వీరిద్దరి మధ్య సుమారు 14 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయితే అక్క కూతురిపై మోజు పడ్డ బార్కి.. ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించి, అక్కతో పాటు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. అయితే మేనమామను పెళ్లి చేసుకోవడం దీపకు ఇష్టం లేదు. అతడు తాగుబోతు కావడంతో పాటు.. అప్పుడప్పుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించేవాడు.
అయినప్పటికీ తల్లిదండ్రులు బలవంతంగా ఆమెకు నిశ్చితార్థం చేశారు. ఇంకొన్ని రోజుల్లో పెళ్లి కూడా చేయాలని నిర్ణయించారు. ఈ మధ్యలోనే అతడు తప్పతాగి వచ్చి.. మేనకోడలితో అసభ్యంగా నడుచుకునే వాడు. ఈ హింసను తట్టుకోలేక దీప.. మేనమామను పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది. ఈ విషయం బార్కికి చెప్పారు అమ్మాయి తల్లిదండ్రులు. దీంతో నిశ్చితార్థం అయ్యాక.. తనను కాదంటుందన్న కోపంతో మాట్లాడుకుందాం రమ్మంటూ ఆమెను బయటకు తీసుకెళ్లాడు. ఓ నిర్జన ప్రాంతానికి తీసుకెళ్లి విషం ఇచ్చి.. అనంతరం ఉరి వేశాడు. దీప కనిపించలేదని తల్లిదండ్రులు వెతుకుతుండగా.. ఏం ఎరుగనట్లు ఉండిపోయాడు. చివరకు అతడి కదలికలు అనుమానంగా తోచి ప్రశ్నించగా నిజం కక్కాడు. దీప తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదుతో బార్కీని అరెస్టు చేసి.. విచారిస్తున్నారు పోలీసులు.