ప్రియుడు కోసం ఆంధ్రా నుండి బెంగళూరుకు వెళ్తే.. అతను మాత్రం దారుణంగా!

ప్రియుడు కోసం ఆంధ్రా నుండి బెంగళూరుకు వెళ్తే.. అతను మాత్రం దారుణంగా!

ఏపీకి చెందిన మహిళ.. కర్ణాటకలోని రాజధాని ప్రాంతం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ పెట్రోల్ బంకులో పనికి కుదిరింది. ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె ఇంటికి ఓ వ్యక్తి తరచూ వస్తూ వెళుతుండేవాడు. కానీ

ఏపీకి చెందిన మహిళ.. కర్ణాటకలోని రాజధాని ప్రాంతం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ పెట్రోల్ బంకులో పనికి కుదిరింది. ఓ ఇళ్లు అద్దెకు తీసుకుని జీవనం సాగిస్తుంది. ఆమె ఇంటికి ఓ వ్యక్తి తరచూ వస్తూ వెళుతుండేవాడు. కానీ

ఈ ఫోటోలోని మహిళ పేరు హేమావతి. జీవనోపాధి కోసం ఆంధ్రప్రదేశ్ నుండి కర్ణాటకలోని రాజధాని ప్రాంతం బెంగళూరుకు వెళ్లింది. అక్కడ ఓ అద్దె ఇల్లు తీసుకుని, ఓ పెట్రోలో బంకులో పనిచేస్తూ జీవనం సాగిస్తుంది. అయితే ఆమె ఇంటికి తరచుగా ఓ వ్యక్తి వచ్చి వెళుతూ ఉండేవాడు. రెండు మూడు రోజులు ఉండి వెళ్లేవాడు. స్థానికులు ఎవరు అని ప్రశ్నించగా.. తన భర్త అంటూ సమాధానం ఇచ్చింది. ఇలా సాగిపోతుండగా.. ఓ రోజు పొద్దుపోయినా హేమావతి తలుపులు తీయలేదు. ఉద్యోగానికి వెళ్లిందేమో అనుకున్నారు. ఎంత సేపటికి అలికిడి లేకపోవడంతో.. ఇరుగుపొరుగు కిటికీలోంచి చూడగా రక్తపు మడుగుల్లో పడి కనిపించింది హేమావతి.

అసలు ఏం జరిగిందంటే..? భర్త అని చెప్పుకుంటున్న ప్రియుడే ఆమె ప్రాణం తీశాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రాకు చెందిన మహిళ హేమావతి బెంగళూరు వచ్చి ఓ పెట్రోల్ బంకులో ఉద్యోగం చేస్తూ.. హేస్కోటేలోని కాలేజీ రోడ్డులో ఓ ఇంట్లో నివాసం ఉంటుంది. ఆమె ఇంటికి వేణు అనే వ్యక్తి 3-4 రోజులకు ఒకసారి వచ్చి వెళ్లేవాడు. 2-3 రోజులు ఆమెతో గడిపేవాడు. స్థానికులు అడిగితే తన భర్త అని చెప్పింది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి హేమావతి ఇంటికి వచ్చిన వేణు.. మంగళవారం తెల్లవారు జామున 3 గంటలకు వరకు ఉండి..తర్వాత తన భార్య వద్దకు వెళ్లాడు. ఆ రోజు విషం తాగి భార్య దగ్గరకు వెళ్లి.. ఓ మహిళను హత్య చేశాను అని చెప్పాడు. కంగారు పడ్డ భార్య..తండ్రికి ఫోన్ చేసింది. వెంటనే పోలీసులు సమాచారం అందుకుని.. వేణుని ఆసుపత్రిలోచేర్చారు.

అయితే వేణు ఓ మహిళను హత్య చేశాను అని చెప్పడంతో.. ఆమె ఎవరు అన్న కోణంలో విచారణ చేపట్టారు. నాలుగు గంటల పాటు వెతుకగా.. అంతలో ఓ మహిళ దారుణ హత్యకు గురైందని సమాచారం అందడంతో హేమావతి ఇంటికి చేరుకున్నారు. తలుపులు తెరిచి చూడగా.. కత్తితో ఆమెను హత్య చేసిన దృశ్యాలు కనిపించాయి. మృతదేహాన్ని హోస్కోట్‌లోని మార్చురీకి తరలించారు. అయితే పోలీసుల దర్యాప్తులో వేణు ఆమె భర్త కాదని, వారి మధ్య కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం నడుస్తుందని గుర్తించారు. ఆంధ్రా నుండి హోస్కెట్‌కు మహిళను తీసుకొచ్చిన వేణు.. అక్కడే కాపురం పెట్టాడు. ఆమెపై అనుమానంతో హత్య చేసి.. అతడు ఆత్మహత్యకు యత్నించినట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న హోస్కోట్ పోలీసులు నిందితుడ్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Show comments