P Venkatesh
ఐదేళ్ల చిన్నారి గుండెపోటుకు గురైంది. ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షిస్తుండగానే మృతిచెందింది.
ఐదేళ్ల చిన్నారి గుండెపోటుకు గురైంది. ఆడుకుంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షిస్తుండగానే మృతిచెందింది.
P Venkatesh
హార్ట్ ఎటాక్ మరణాలు అందరినీ కలవరానికి గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా గుండెపోటుకు గురవుతున్నారు. చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్లందరిలో గుండెపోటు గుబులు పుట్టిస్తున్నది. అప్పటి వరకు సంతోషంగా గడిపిన వారు ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నారు. గుండెపోటు మరణాలు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపుతున్నాయి. అప్పటి వరకు తమతో ఆనందంగా గడిపిన వారు గుండెపోటు బారిన పడి తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోధిస్తున్నారు. అయితే ప్రతి రోజు వ్యాయామం చేస్తూ.. పౌష్టికాహారాన్ని తీసుకుంటూ.. శరీరం ఫిట్ నెస్ కోసం శ్రద్ధ తీసుకుంటున్న వారు కూడా హార్ట్ ఎటాక్ కు గురవుతున్నారు.
ఆరోగ్యంగా కనిపించిన వారు సైతం హఠాత్తుగా ఊపిరి వదులుతున్నారు. అయితే మారుతున్న జీవన శైలి, ఆహార పదార్థాలు గుండె సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయంటున్నారు నిపుణులు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు అన్నట్లుగా.. హార్ట్ ఎటాక్ ఎప్పుడు కబళించుకుపోతుందో తెలియక భయంతో వణికిపోతున్నారు. ఇదే రీతిలో ఓ చిన్నారిని గుండెపోటు కబళించుకుపోయింది. కేవలం ఐదేళ్ల వయసులోనే చిన్నారి హార్ట్ ఎటాక్ తో మృతి చెందింది. చిన్నారి మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అప్పటివరకూ కళ్లెదుటే ఆడుకున్న కూతురు అకస్మాత్తుగా విగతజీవిగా పడి పోవడంతో కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి.
ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన రాజు-జమున దంపతులకు ఉక్కులు (5) అనే కూతురు ఉంది. కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు. ఈక్రమంలో మంగళవారం ఉదయం నిద్రలేచిన బాలిక కాసేపు ఆడుకున్నది. ఆ తర్వాత కళ్లు తిరుగుతున్నాయని తల్లికి చెప్పి సడెన్ గా కిందపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే బాలికను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలికను పరీక్షించిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని హన్మకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో హుటాహుటిన బాలికను హన్మకొండకు తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షిస్తుండగానే చిన్నారి కన్నుమూసింది.
కాగా చిన్నారికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నాయని.. ఆ విషయాన్ని తల్లిదండ్రులు గుర్తించలేకపోయారని వైద్యులు తెలిపారు. అందువల్లే గుండెపోటు వచ్చి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. కూతురు మరణంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఎంతో ఆక్టివ్ గా ఉండే తమ కూతురు గుండె పోటుతో మరణించడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. 5 ఏళ్ల వయసులోనే చిన్నారి గుండోపోటుతో మరణనించడంతో జమ్మికుంటలో విషాదం అలుముకుంది. మరి ఐదేళ్ల చిన్నారిని గుండెపోటు కబళించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.