Venkateswarlu
ఇక, గూగుల్ పే దేశంలోని పలు బ్యాంకులతో భాగస్వామ్యం అయి తమ కస్టమర్లకు లోన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు ద్వారా పర్సనల్ లోన్‌లను కూడా అందిస్తోంది.
ఇక, గూగుల్ పే దేశంలోని పలు బ్యాంకులతో భాగస్వామ్యం అయి తమ కస్టమర్లకు లోన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు ద్వారా పర్సనల్ లోన్‌లను కూడా అందిస్తోంది.
Venkateswarlu
దేశ వ్యాప్తంగా కొన్ని లక్షల మంది ‘గూగుల్ పే’ను వాడుతున్నారు. నగదు లావాదేవీల దగ్గరినుంచి మొబైల్ రీఛార్జ్‌లు, బిల్లుల చెల్లింపులు, లోన్‌లు ఇలా చాలా రకాలుగా గూగుల్‌పై కస్టమర్లకు సేవలందిస్తోంది. గూగుల్ పే పరిధి రోజుకు రోజుకు పెరుగుతూ పోతోంది. కస్టమర్ల కోసం కొత్త కొత్త సేవలు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా, కొత్త లోన్‌లను గూగుల్ పే అందుబాటులోకి తెచ్చింది. అర్జెంట్ పనుల కోసం డబ్బులు అవసరం ఉన్న వారు.. దాదాపు 15 వేల రూపాయల లోన్‌ను ఈజీగా.. త్వరగా పొందవచ్చు.
ఈ లోన్‌ను తక్కువ ఈఎమ్‌ఐ ద్వారా రీ పేమెంట్ చేసే అవకాశం ఉంది. నెలకు 111 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. గూగుల్ పేతో భాగస్వామ్యం ఏర్పరచుకుని డీఎమ్‌ఐ ఫైనాన్స్ ఈ లోన్‌లను అందిస్తోంది. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి సాకారం అందించాలన్న ఉద్ధేశ్యంతో సదరు కంపెనీ ‘‘ సాచెట్ లోన్’’లను అందుబాటులోకి తెచ్చింది. తక్కువ మొత్తంలో డబ్బు అవసరం ఉన్న వారు ఈ సాచెట్ లోన్ ఆప్చన్ ఎంచుకోవచ్చు. ప్రీ అప్రూవుడ్ లోన్స్‌ల లాగా చాలా త్వరగా.. ఈజీగా లోన్‌లను పొందవచ్చు.
ఇక, గూగుల్ పే దేశంలోని పలు బ్యాంకులతో భాగస్వామ్యం అయి తమ కస్టమర్లకు లోన్లను అందిస్తున్న సంగతి తెలిసిందే. యాక్సిస్ బ్యాంకు ద్వారా పర్సనల్ లోన్‌లను కూడా అందిస్తోంది. గూగుల్ పే వ్యాపారులకు క్రెడిట్ లోన్‌లను అందించడానికి ఈపే లేటర్‌తో ఒప్పందాలు చేసుకుంది. మరి, గూగుల్ పే తమ కస్టమర్లకు సాచెట్ లోన్‌ల కింద 15 వేల రూపాయల లోన్‌ను అందించటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.