HYDలో స్థలం కొంటారా? ఈ ఏరియాల్లో ల్యాండ్ రేట్లు తగ్గాయి.. ఇదే మంచి ఛాన్స్!

Hyd Land Rates Reduced:హైదరాబాద్ లో స్థలం కొనాలని భావిస్తున్నారా? అయితే ఎక్కడ స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా స్థలాల రేట్లు తగ్గిన ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఇలాంటి ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంటే కనుక మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.

Hyd Land Rates Reduced:హైదరాబాద్ లో స్థలం కొనాలని భావిస్తున్నారా? అయితే ఎక్కడ స్థలాల రేట్లు తక్కువగా ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పైగా స్థలాల రేట్లు తగ్గిన ఏరియాల్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఎక్కువగా ఉంటుంది. మీరు కనుక ఇలాంటి ల్యాండ్స్ మీద పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉంటే కనుక మీకు ఈ కథనం ఉపయోగపడుతుంది.

స్థలం కొనుక్కుని ఇల్లు కట్టుకోవాలని.. లేదా స్థలం మీద పెట్టుబడి పెట్టి లాభం పొందాలని చాలా మందికి ఒక కల ఉంటుంది. అయితే తక్కువ ధర ఉన్నప్పుడు స్థలం కొన్నాక దాని విలువ పెరిగితే సంతోషంగా ఉంటుంది. తీరా కొన్నాక ధర తగ్గితేనే చాలా బాధగా ఉంటుంది. మీరు కనుక తగ్గిన తర్వాత స్థలం కొనాలి అని ఎదురుచూస్తున్నట్లైతే కనుక ఇదే మంచి ఛాన్స్. ఇక హైదరాబాద్ లో స్థలం కొనడం అనేది ఒక పెద్ద కల. కొందరికి అదొక పీడ కల కూడా. అయినప్పటికీ హైదరాబాద్ నగరంలో స్థలం కొనాలన్నా ఆలోచనలో ఉంటే కనుక ఈ ఏరియాల్లో ట్రై చేయండి. ఎందుకంటే ఇక్కడ స్థలాల రేట్లు తగ్గాయి. ఎక్కువ ధర ఉన్న ఏరియాల్లో ఎక్కువ పెట్టుబడి పెట్టి తక్కువ లాభం పొందడం కంటే ఈ ఏరియాల్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందవచ్చు.    

హైదరాబాద్ లో ఉన్న ఏరియాల్లోనూ, అలానే నగర శివారు ప్రాంతాల్లో ఉన్న స్థలాల రేట్లు తగ్గాయి. ఈ తగ్గడం కూడా ఒక్క నెలలోనే తగ్గాయి. తగ్గిన వాటిలో జూబ్లీహిల్స్ ప్రాంతం ఒకటి. జూబ్లీహిల్స్ లో గతంలో చదరపు అడుగు 36,100 రూపాయలు ఉండగా ఇప్పుడు అది 32,300 రూపాయలకు చేరుకుంది. కొండాపూర్ లో గతంలో చదరపు అడుగు స్థలం రూ.14,800 ఉండగా.. ప్రస్తుతం 13,400 రూపాయలుగా ఉంది. వనస్థలిపురంలో గతంలో చదరపు అడుగు స్థలం రూ. 7,100 ఉండగా ఇప్పుడు రూ. 6,650కి పడిపోయింది. నల్లగండ్లలో 12,800 రూపాయలుగా ఉన్న చదరపు అడుగు ఇప్పుడు రూ. 12,750కి చేరుకుంది. కొల్లూరులో చదరపు అడుగు స్థలం 4 వేల నుంచి 3,850కి చేరుకుంది. బీరంగూడలో రూ. 4,250 నుంచి 4,200కి తగ్గింది.

మల్లంపేటలో గతంలో 6,650 ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 6,150 రూపాయలకు తగ్గింది. సుల్తాన్ పూర్ లో చదరపు అడుగు స్థలం 3900 ఉండగా ఇప్పుడు 3450 అయ్యింది. పటాన్ చేరులో నెల క్రితం 3,200 ఉన్న చదరపు అడుగు స్థలం.. ఇప్పుడు 3 వేలు అయ్యింది. మొయినాబాద్ లో 2050గా ఉన్న స్థలం ఇప్పుడు 1600 అయ్యింది. తుక్కుగూడలో 3050 నుంచి 2800కి తగ్గింది. నాగోల్ లో 7,550 నుంచి 7,450కి తగ్గింది. అల్వాల్ లో 7,800గా ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 7,150 పలుకుతోంది. మాన్సన్ పల్లిలో గతంలో 1700 రూపాయలుగా ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 1650 రూపాయలుగా ఉంది.

అవుషాపూర్ లో 1700 రూపాయలుగా ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 1450 అయ్యింది. ముత్తంగిలో 3500 రూపాయలుగా ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 2800కి తగ్గింది. నాదర్గుల్ 3,450 నుంచి 3,150, తుర్కయంజాల్ 3,900 నుంచి 3,150కి తగ్గాయి. ఇక అందరి దృష్టి తనపై వేసుకున్న బెంగళూరు హైవే ఏరియాలో కూడా ల్యాండ్ రేట్లు తగ్గాయి. నెల, రెండు నెలల క్రితం చదరపు అడుగు స్థలం 1600 రూపాయలు ఉండగా ఇప్పుడు 1500 అయ్యింది. అవుటర్ రింగ్ రోడ్ దగ్గర ఉన్న స్థలాలు ధరలు కూడా తగ్గాయి. గతంలో 6,600 రూపాయలు ఉన్న చదరపు అడుగు స్థలం ఇప్పుడు 6,550 రూపాయలుగా ఉంది. ఇవన్నీ యావరేజ్ గా ఉన్న స్థలాల రేట్లు. ఈ ఏరియాల్లో ఉన్న లొకేషన్ బట్టి స్థలాల ధరల్లో మార్పులు ఉంటాయి.

గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.

Show comments