Vinay Kola
IRCTC: రైలు ప్రమాదంలో అప్పుడప్పుడు మనకు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
IRCTC: రైలు ప్రమాదంలో అప్పుడప్పుడు మనకు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
Vinay Kola
రైల్వే ప్రయాణికులకు ఇప్పుడు చెప్పే వార్త నిజంగా శుభవార్త అనే చెప్పాలి. మీరు కేవలం 45 పైసలు కడితే రూ.10 లక్షల లాభం పొందవచ్చు. ఈ స్కీమ్ ఎప్పటి నుంచో ఉన్నా కానీ చాలా మందికి దీని గురించి తెలియదు. అందువల్ల ఈ ఛాన్స్ ని మిస్ అవుతున్నారు. ఇక ఈ స్కీమ్ ఏంటి? దీని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇదొక ఇన్సూరెన్స్ స్కీమ్. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) కొత్త ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొచ్చింది. ఇందులో ప్రీమియంని ప్రయాణికుడికి కేవలం 45 పైసలకే ఇస్తుంది. రైలు ప్రయాణాలు చేసేవారికి ఇది తప్పనిసరి. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరకీ తెలీదు. రైలు ప్రయాణంలో మనకు అనుకోని ప్రమాదాలు జరగవచ్చు. అది చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ జాగ్రత్తగా ఉండటం మంచిది. అందుకే రైలు ప్రయాణికులు అందరూ కూడా కచ్చితంగా ఈ పాలసీ తీసుకుంటే మంచిది.
ఇక ఈ స్కీమ్ భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా ఇ-టికెట్ల ద్వారా బుక్ చేసుకునే ప్రయాణికులు మాత్రమే పొందుతారు.విదేశీ పౌరులు, ఏజెంట్లు లేదా ఇతర ట్రావెల్ ఏజెన్సీల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులు ఈ బెనిఫిట్ పొందలేరు. అలాగే సీటు లేకుండా టిక్కెట్లు బుక్ చేసుకునే 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు కూడా ఈ బెనిఫిట్ పొందలేరు. కానీ 5-11 ఏళ్లలోపు పిల్లలకు టికెట్ బుక్ చేసినట్లయితే ఈ బీమా వారికి కూడా అప్లై అవుతుంది.ఈ స్కీమ్ లో చేరితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రైలు ప్రయాణంలో ఇతర కారణాల వల్ల చనిపోతే వారి మృతదేహాన్ని తరలించడానికి రూ.10,000 దాకా ఇన్సూరెన్స్ వస్తుంది. అలాగే రైలు ప్రమాదంలో గాయాలు అయినప్పుడు ఆసుపత్రిలో చేరే ఖర్చులకు రూ.2 లక్షల వరకు డబ్బులు ఇస్తారు. ఒకవేళ రైలు ప్రమాదంలో మీకు ఏమైన చిన్న వైకల్యం కలిగినప్పుడు 75% డబ్బులు ఇస్తారు. అంటే రూ.7,50,000 దాకా ఇస్తారు. ఒకవేళ శాశ్వతంగా వైకల్యం చెందినట్లయితే 100% బీమా డబ్బు అందుతుంది. అంటే రూ. 10 లక్షలు ఇస్తారు. ఒకవేళ ప్రయాణంలో ప్రమాదవశాత్తు మరణిస్తే నామినీకి బీమా 100% లభిస్తుంది. అంటే రూ.10 లక్షలు ఇస్తారు.
ఈ స్కీమ్ కి రైల్వే టికెట్ బుక్ చేసుకున్నప్పుడు అప్లై చేసుకోవచ్చు. SMS, ఇమెయిల్ ద్వారా ప్రయాణికుడికి దీని గురించి ఇన్ఫర్మేషన్ అందుతుంది. ప్రయాణికులు వారి టిక్కెట్ బుకింగ్‌లో పాలసీ నంబర్, కావలసిన ఇన్ఫర్మేషన్ చెక్ చేయవచ్చు. ఇన్సూరెన్స్ కంపెనీ వెబ్‌సైట్‌లో టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నామినీ డీటైల్స్ కూడా ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నామిని డీటైల్స్ ఇవ్వకపోతే క్లెయిమ్ విషయంలో చట్టపరమైన వారసులకు బీమా డబ్బులు ఇస్తారు. ఈ పాలసీ వెరిఫై చేసిన RAC (Reservation Against Cancellation) టిక్కెట్ హోల్డర్లకు మాత్రమే వర్తిస్తుంది. ప్రయాణ సమయంలో ప్రమాదాలు లేదా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు ప్రయాణికులను రక్షించేందుకు ఈ పాలసీ ఉపయోగపడుతుంది. ఇదీ సంగతి. ఈ పాలసీ గురించి మీరేమి అనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి.