రతన్ టాటా కు ఫేవరేట్ కార్ ఇదే .. కారణం ఏంటంటే!

Ratan Tata Favourite Car: రతన్ టాటా అసలు పరిచయం అవసరం లేని పేరు. వ్యాపార రంగంలో ఈయనను మించిన వారు మరొకరు ఉండరు. ఇప్పుడు ఆయన శఖం ముగిసింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అయితే ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది కార్స్. మరి ఆయన ఫేవరేట్ కార్ ఏమై ఉంటుందో చూసేద్దాం.

Ratan Tata Favourite Car: రతన్ టాటా అసలు పరిచయం అవసరం లేని పేరు. వ్యాపార రంగంలో ఈయనను మించిన వారు మరొకరు ఉండరు. ఇప్పుడు ఆయన శఖం ముగిసింది. ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. అయితే ఈ పేరు వినగానే అందరికి గుర్తొచ్చేది కార్స్. మరి ఆయన ఫేవరేట్ కార్ ఏమై ఉంటుందో చూసేద్దాం.

ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్ టాటా మరణించిన వార్త అందరిని కలవర పెడుతుంది. ఇండియా లో తిరుగులేని వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పారు రతన్ టాటా. జీవితంలో పై స్థాయికి ఎదగాలని అనుకునే ప్రతి ఒక్కరికి రతన్ టాటా ఆదర్శం. ఆయన ఇన్నేళ్ల ప్రయాణం ఎన్నో పాఠాలను చెప్తుంది. ఈ రోజు ఆయన అందరి మధ్యన లేరనే మాట వినగానే..రక్త సంబంధం లేకపోయినా అందరి కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. కోట్లాది మందితో కలుపుకున్న బంధుత్వం ఆయనది. అయితే రతన్ టాటా పేరు వినగానే అందరికి ముందు గుర్తొచ్చేది కార్లే . 1991లో టాటా సైన్స్ చైర్మన్ గా రతన్ టాటా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత దానిని భారీగా విస్తరించారు. టాటా ఇండికా లాంటి ఎన్నో రకాలా మోడల్స్ ను మార్కెట్ లో పరిచయం చేశారు. మరి అన్ని కార్స్ ను పరిచయం చేసిన రతన్ టాటాకు.. తన ఫేవరేట్ కార్ ఇదేనంటూ ఓసారి చెప్పుకొచ్చారు.

రతన్ టాటాకు టాటా మోటార్స్ రూపొందించిన ఇండికా కార్ అంటే ఎక్కువ ఇష్టం అంట. గతంలో ఈ విషయాన్నీ తానే స్వయంగా చెప్పుకొచ్చారు. తనకు ఇష్టమైన కార్ పక్కన నిలబడి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. ’25 సంవత్సరాల క్రితం, టాటా ఇండికాను ప్రారంభించడంతో భారతదేశ స్వదేశీ ప్యాసింజర్‌ కార్ల పరిశ్రమకు పునాది పడింది. ఇది మధురమైన జ్ఞాపకాలను నాకు ఎప్పుడూ గుర్తు చేస్తుంది. ఈ కారుకు నా హృదయంలో ప్రత్యేక స్థానం ఉంది’ అంటూ చెప్పుకొచ్చారు. టాటా మోటార్స్ సంస్థ.. 1998 లో ఇండికాతో కార్ల తయారీని స్టార్ట్ చేసింది. స్టార్ట్ చేసిన రెండు సంవత్సరాలలోనే ఈ సంస్థ అమ్మకాలలో మొదటి స్థానంలో నిలిచింది. క్యాబ్ సర్వీస్ లు స్టార్ట్ చేసిన మొదట్లో ఎక్కువగా ఈ కార్లే తిరిగేవి. ఇక దీని తర్వాత ఇండికాలో విస్టా , మాంజా అనే మోడల్స్ వచ్చినప్పటికీ కూడా అవి అమ్మకాలలో అంతగా రాణించలేకపోయాయి.

దీనితో 2018 లో టాటా మోటార్స్ ఇండికా తయారీని నిలిపివేసింది. ఆ తర్వాత నుంచి దాదాపు ఈ సంస్థ ప్రయాణికుల భద్రతకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. అంతే కాకుండా అందరికి అందుబాటు ధరల్లోని మార్కెట్ లోకి కార్లను తీసుకుని వస్తుంది. పైగా గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో ఇండియాలో మొట్ట మొదటిసారిగా 5/5 రేటింగ్‌ సాధించిన కారు టాటా నెక్సాన్‌. దీని సృష్టి కర్త కూడా రతన్ టాటానే. ఇలా పదుల సంఖ్యలో ఎన్నో సంస్థలను స్థాపించి.. ఎంతో మందికి ఉపాధి కల్పించారు. వ్యాపారవేత్తగానే కాదు సమాజ సేవలోను ఆయన ఎప్పుడు ముందుటారు. ఇలా ఆయన దాతృత్వ సేవలకు గుర్తింపుగా కేంద్రం కొన్ని ప్రతిష్టాత్మకమైన అవార్డ్స్ ను ప్రదానం చేసింది. 2000 లో పద్మ భూషణ్ , 2008 లో పద్మ విభూషణ్, ఇక ఇటీవల ప్రతిష్టాత్మక ‘పీవీ నర్సింహారావు స్మారక అవార్డు’ కూడా లభించింది. మరి రతన్ టాటా ఫేవరేట్ కార్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments