ప్రయాణికులకు స్పైస్ జెట్ శుభవార్త.. ఏకంగా బస్సు ధరకే..!

దేశ వ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన అద్భుత ఘట్టం ముగిసింది. రామ మందిరంలో రాం లల్లా విగ్రాహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. బాల రాముని విగ్రహం వీక్షించి భక్తులు పులకరించపోతున్నారు.

దేశ వ్యాప్తంగా ఎంతో ఆత్రుతతో ఎదురు చూసిన అద్భుత ఘట్టం ముగిసింది. రామ మందిరంలో రాం లల్లా విగ్రాహానికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. బాల రాముని విగ్రహం వీక్షించి భక్తులు పులకరించపోతున్నారు.

దేశంలో ఇప్పుడు అందరి చూపు అయోధ్య వైపే ఉంది. నేడు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అయోధ్యలో రామమందిరం ఎంతో ఘనంగా ప్రారంభించారు. బాల రాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరింగింది. ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా జరిగిన ఈ వేడుకకు దేశంలోని ప్రముఖులు, వేల సంఖ్యలో ప్రజలు తరలి వచ్చారు. కోట్ల మంది ప్రజలు సోషల్ మాధ్యమాల ద్వారా వీక్షించారు. అయోధ్య నగరం ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపిస్తుంది. ప్రాణ ప్రతిష్ట సందర్భంగా సాయంత్రం పదిలక్షల దీపాలను వెలిగించే కార్యక్రమం చేపడుతున్నారు. రేపటి నుంచి అంటే జనవరి 23, మంగళవారం నుంచి సాధారణ భక్తులకు బాల రాముని దర్శనం ఉండబోతుంది. ఈ సందర్భంగా స్పైస్ జెట్ ప్రయాణికులకు గొప్ప శుభవార్త చెప్పింది. వివరాల్లోకి వెళితే..

మంగళవారం నుంచి అయోధ్య రామ మందిరంలో బాల రాముని దర్శించుకునేందుకు అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ క్రమంలో స్పైస్ జెట్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ఇందులో భాగంగా టికెట్ ధర రూ.1,622 నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రకటించింది. ఇది దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలన్నింటికి వర్తిస్తుందని తెలిపింది. అయితే ఇది వన్ వేకు మాత్రమే వర్తిస్తుందని తెలిపింది. అంతేకాదు స్పైస్ మ్యాక్స్, యూఫస్ట్ వంటి యాడ్ – ఆన్ లు సహా సీట్ల ఎంపిక చార్జీలపై అదనంగా ముప్పై శాతం రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది.  ఈ ఆపర్ జనవరి 22 నుంచి 28 మధ్య టికెట్ బుక్ చేసుకున్న వాళ్లకే మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపింది.

ఈ ధమాకా సేల్ సందర్భంగా టిక్కెట్ ను బుక్ చేసుకున్న వారికి విమానం బయటుదేరడానికి 96 గంటల ముందు వరకు ప్రయాణ తేదీని ఉచింతంగానే మార్చుకున్నే అవకాశం కల్పిస్తుంది. ఈ మాధ్యమం ద్వారా అయినా బుక్ చేసుకునే సౌలభ్యం ఉందని తెలిపింది. ముంబై – గోవా, ఢిల్లీ – జైపూర్, గౌహతి – బాగ్ డోడ్రా వంటి ప్రముఖ మార్గాల్లో కనిష్ట ధరకు రూ. 1,622 వర్తిస్తుందని స్పైస్ జెట్ సంస్థ ప్రకటించింది. అయోధ్యకు వెళ్లి రామ మందిరంలోని బాల రాముడిని దర్శించుకోవాలననుకునే వారు ఈ అవకాశం వినియోగించుకోవాలని సూచించింది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెం్టస్ రూపంలో తెలియజేయండి.

Show comments