గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలు.. నేడు తులం ఎంతంటే?

గోల్డ్ ధరలకు మళ్లీ రెక్కలు.. నేడు తులం ఎంతంటే?

బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే?

బంగారం ప్రియులకు మళ్లీ షాక్ తగులుతోంది. వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం గోల్డ్ ధర ఎంత ఉందంటే?

మగువలకు మళ్లీ షాక్ ఇస్తున్నాయి బంగారం ధరలు. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న గోల్డ్ ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. వరుసగా తగ్గిన పుత్తడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. పెరిగిన ధరలతో బంగారం కొనేందుకు వెనకడుగు వేస్తున్నారు బంగారం ప్రియులు. ప్రస్తుతం శుభకార్యాలు, పెళ్లిల్లు ఎక్కువగా లేకపోవడంతో బంగారానికి డిమాండ్ తగ్గిపోయింది. డాలర్ తో రూపాయి మారకం పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకుంటున్న ఒడిదుడుకులు బంగారం ధరల్లో మార్పులకు కారణమవుతున్నాయి. నేడు బంగారం ధరలు పెరిగాయి. నేడు తులం బంగారం ధర ఎంత ఉందంటే?

బంగారం ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. గత వారం రోజులుగా తగ్గుతూ ఊరటనిచ్చిన గోల్డ్ ధరలు మళ్లీ ఉసూరుమనిపిస్తున్నాయి. నేడు హైదరాబాద్ మార్కెట్ లో తులం బంగారంపై రూ. 10 పెరిగింది. పెరిగిన ధరలతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160 అమ్ముడవుతోంది. విజయవాడలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,170 వద్దకు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,160 అమ్ముడవుతోంది. ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 66,310 గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72340 వద్ద ట్రేడ్ అవుతున్నది.

ఇక వెండి విషయానికి వస్తే.. వెండి ధరల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. నేడు సిల్వర్ ధరలు తగ్గాయి. బంగారం ధరలు పైకి ఎగబాకుతున్న వేళ సిల్వర్ ధరలు తగ్గుతుండడంతో సామాన్యులకు ఊరట కలుగుతున్నది. నేడు హైదరాబాద్ మార్కెట్ లో కిలో వెండిపై రూ. 100 తగ్గింది. దీంతో కిలో సిల్వర్ ధర రూ. 94500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 100 తగ్గి రూ. 89900కి చేరింది. ఇక బంగారం ధరలు పెరుగుతుండడంతో బంగారం కొనాలనుకునే వారు వెనకడుగు వేస్తున్నారు. సీజన్, అన్ సీజన్ తో సంబంధం లేకుండా బంగారం ధరలు పెరుగుతుండడంతో వినియోగదారులకు షాక్ తగులుతోంది.

Show comments