Dharani
BSNL Rs 1999 Plan: వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. 2 వేల రూపాయల లోపే 600 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్లాన్ వివరాలు..
BSNL Rs 1999 Plan: వినియోగదారుల కోసం బీఎస్ఎన్ఎల్ అద్భుతమైన ప్లాన్ ను తీసుకొచ్చింది. 2 వేల రూపాయల లోపే 600 జీబీ డేటా, అన్లిమిటెడ్ కాలింగ్ ప్రయోజనాలు పొందవచ్చు. ఆ ప్లాన్ వివరాలు..
Dharani
ప్రైవేటు టెలికాం సంస్థలైన ఎయిర్టెల్, జియోలు రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచిన సంగతి తెలిసిందే. ఒక్కో ప్లాన్ మీద 80-100 రూపాయల వరకు పెరిగింది. దాంతో చాలా మంది కస్టమర్లు.. బీఎస్ఎన్ఎల్ కు మారారు. ఇక ఈ అవకాశాన్ని వినియోగించుకుని, కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం మిగతా కంపెనీల కన్నా తక్కువ ధరకే ప్లాన్ లను తీసుకొస్తుంది. దీనిలో భాగంగా తాజాగా బీఎస్ఎన్ఎల్.. కేవలం 2000 వేల రూపాయల లోపే ఏడాదంతా వ్యాలిడిటీ ఉండే ప్లాన్ ను తీసుకొచ్చింది. దీన్ని రీఛార్జ్ చేసుకుంటే.. 600 జీబీ డేటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ఆఫర్ ను ప్రకటించింది. ఆ వివరాలు..
బీఎస్‌ఎన్‌ఎన్‌ఎల్ కస్టమర్ల కోసం అత్యంత చౌక ధరకే.. ఏడాది పాటు వ్యాలిడిటీ ఉండే.. ప్లాన్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా కస్టమర్లు రూ.1999తో రీఛార్జ్ చేసుకుంటే.. అన్‌లిమిటెడ్ కాలింగ్ సహా రోజువారీ 100 ఎస్ఎంఎస్ లను పొందవచ్చు. దీంతో పాటు మొత్తంగా 600 జీబీ హైస్పీడ్ డేటాను పొందవచ్చు. ఈ డేటా వ్యాలిడిటీ 365 రోజులు ఉంటుంది. అంటే రోజువారీ డేటా వినియోగంపై ఎటువంటి పరిమితి లేదు. అంటే నెలవారీగా చూసుకుంటే కేవలం రూ.166 మాత్రమే ఖర్చు కానుంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌లో ఇదే మెరుగైన ప్లాన్‌గా గుర్తింపు పొందింది.
రీఛార్జ్ ధరలు తక్కువగా ఉండడం సహా 4జీ, 5జీ సేవల ప్రారంభం కానున్న నేపథ్యంలో అనేక మంది బీఎస్ఎన్ఎల్ కి మారుతున్నారు. ఇక ఇవాళ్టి నుంచి దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసులను ప్రారంభం కానున్నాయి. ఇందుకోసం దేశవ్యాప్తంగా లక్ష టవర్ల ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 అక్టోబర్ చివరి నాటికి 80,000 టవర్‌లను ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర మంత్రి జోతిరాదిత్య సింధియా తెలిపారు. 2025 మార్చి నాటికి మిగిలిన 21,000 టవర్ల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. అలానే 2025 నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలను అందుబాటులోకి తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఇక త్వరలోనే బీఎస్ఎన్ఎల్ కు మారే కస్టమర్ల సంఖ్య మరింత పెరగనుంది అని భావిస్తున్నారు.
సెప్టెంబర్ నాటికి మరిన్ని ప్రాంతాల్లో 4జీ నెట్ వర్క్ అందుబాటులోకి తీసుకురావాలని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. నగరాలు, పట్టణాల్లోనే కాక గ్రామాల్లోనూ 4జీ సర్వీసులు అందించేలా బీఎస్ఎన్ఎల్ చర్యలు తీసుకుంటుంది.