Bigg Boss Telugu Season 8 Contestants- Jabardasth Mahidhar: బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు వీళ్లే.. సుత్తిలేకుండా చెప్పేసిన జబర్దస్త్ మహిధర్!

బిగ్ బాస్ 8 కంటెస్టెంట్లు వీళ్లే.. సుత్తిలేకుండా చెప్పేసిన జబర్దస్త్ మహిధర్!

Bigg Boss Telugu Season 8 Contestants- Jabardasth Mahidhar: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి షోని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఎవరికి వాళ్లు కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ లిస్టులు కూడా వదులుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ మహిధర్ కూడా కొందరి పేర్లను రివీల్ చేశాడు.

Bigg Boss Telugu Season 8 Contestants- Jabardasth Mahidhar: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి షోని చాలా గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. అలాగే ఎవరికి వాళ్లు కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ లిస్టులు కూడా వదులుతున్నారు. ఇప్పుడు జబర్దస్త్ మహిధర్ కూడా కొందరి పేర్లను రివీల్ చేశాడు.

తెలుగులో బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదైనా ఉంది అంటే.. బుల్లితెర ప్రేక్షకులు, ఓటీటీ ప్రేక్షకులు టక్కున బిగ్ బాస్ తెలుగు అనేస్తారు. ఇంకా కొన్ని రోజుల్లోనే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు అంతా ఈ షో కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈసారి కూడా హోస్ట్ గా కింగ్ నాగార్జునానే వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 1వ తారీఖు లేదంటే.. సెప్టెంబర్ 8వ తారీఖు నుంచి ఈ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ షో, కంటెస్టెంట్స్ కి సంబంధించి చాలామంది పేర్లు వైరల్ అవుతున్నాయి. అయితే జబర్దస్త్ మహిధర్ తనకు ఉన్న విశ్వసనీయ సమాచారం ప్రకారం కొన్ని పేర్లను వెల్లడించాడు. దాదాపుగా వీళ్లే ఈసారి సీజన్ కి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. మరి.. వాళ్లు ఎవరు? నిజంగానే వచ్చే అవకాశాలు ఉన్నాయా? చూద్దాం.

జబర్దస్త్ షో ద్వారా మహిధర్ కు తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ రివ్యూలు, సినిమా రివ్యూల ద్వారా కూడా ఒక మంచి యూట్యూబర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇతను చెప్పే బిగ్ బాస్ రివ్యూలకు మంచి క్రేజ్ కూడా ఉంది. మహిధర్ చెప్పిన ప్రకారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ లిస్ట్ ఇలా ఉంది. బుల్లితెర కమెడియన్స్ నుంచి జబర్దస్త్ నరేశ్, యాదమ్మ రాజు, కిరాక్ ఆర్పీ, బంచిక్ బబ్లూ పేర్లు వినిపిస్తున్నాయి. సీరియల్ కేటగిరీ నుంచి రీతూ చౌదరి, ప్రేరణ కంభం, ఏక్ నాథ్- హారిక జంట, హీరోయిన్స్ కేటగిరీ నుంచి సోనియా సింగ్, కుషితా కల్లపు, సోషల్ మీడియా ఇన్ ఫ్లుఎన్సర్స్ కేటగిరీ నుంచి మహాసేన రాజేశ్, యువ సామ్రాట్, హీరో ఆదిత్య ఓం వచ్చే అవకాశాలు ఉన్నాయని జబర్దస్త్ మహిధర్ చెప్పుకొచ్చాడు.

ఇంక ఈ లిస్టు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి కూడా బిగ్ బాస్ 2.0 ఉండే ఛాన్సెస్ హైగా ఉన్నాయని చెప్పాడు. అలాగే ఈసారి ఒక బిగ్ సర్ ప్రైజ్ ఉందని.. సెప్టెంబర్ 1న షో ప్రారంభం కాబోతోంది కాబట్టి.. ఆ సర్ ప్రైజ్ ని ఆగస్టు 30న రివీల్ చేస్తాను అన్నాడు. అది మిగిలిన 106 రోజులు కొనసాగుతుందని వెల్లడించాడు. ఇంక మహిధర్ విషయం పక్కన పెడితే.. ఈసారి బిగ్ బాస్ 8ని గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అపరిమిత ఎంటర్ టైన్మెంట్ ఉండేలా టాస్కులను కూడా కొత్త తరహా ప్లాన్ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. అందుకే కంటెస్టెంట్స్ కూడా 100 శాతం ఎంటర్ టైన్మెంట్ ఇచ్చే వాళ్లనే తీసుకోవాలి అని ఇలా ప్లాన్ చేశారు అంటున్నారు. మరి.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఎవరు కంటెస్టెంట్స్ గా వస్తే బాగుంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments