ఫేక్ సింపథీ గేమ్స్ ఎప్పటి వరకు? రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ఆట రాను రాను.. రసవత్తరంగా మారుతోంది. గొడవలు, కొట్లాటలు, ఎత్తులు, పైఎత్తులు, లవ్ ట్రాకు.. అబ్బో ఇలా బిగ్ బాస్ హౌస్ కళకళలాడుతోంది. హౌస్ లో ఏ కంటెస్టెంట్ హైలెట్ అయినా కాకపోయినా.. రతికా రోజ్ మాత్రం తప్పకుండా హైలెట్ అవుతుంది. నెగిటవ్ కావచ్చు, పాజిటివ్ కావచ్చు.. కెమెరాలు మాత్రం ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నిజానికి ఆమె అలా స్కెచ్ వేసుకుని వచ్చిందని ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. హౌస్ లో మాత్రం ఫోకస్ అయ్యేందుకు, కంటెంట్ ఇచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఆ విషయాన్ని ఆమె ముందే చెప్పారు.

రతిక బిగ్ బాస్ స్టేజ్ మీద నుంచే తాను ఒక భగ్న ప్రేమికురాలు అనే విషయాన్ని చెప్పుకుంది. నాగార్జునానే ఆమె బ్రేకప్ స్టోరీ గురించి అడుగుతాడు. అందుకు ఆమె చేసిందంతా చేసి ఇప్పుడు ఇలా అడుగుతున్నారా? అంటూ కామెంట్ చేయడం చూశాం. నాగార్జునా వల్లే తనకు బ్రేకప్ అయినట్లు చెప్పుకొచ్చింది. అయితే ఆమె మాజీ ప్రియుడు రాహుల్ సిప్లిగంజ్ అని.. బిగ్ బాస్ లో పునర్నవి భూపాలంతో లవ్ ట్రాక్ నడపబట్టే రతికా లవ్ బ్రేక్ అయిందని ప్రచారాలు జరుగుతున్నాయి. నిజానికి ఇంతకాలం లేని కథలు, బ్రేకప్ స్టోరీలు, ఫొటోలు అన్నీ ఒక్కసారిగా ఇంటర్నెట్ ని షేక్ చేశాయి. ఒకవేళ వాళ్లు నిజంగా లవర్స్ అయ్యుంటే.. వాళ్ల బ్రేకప్ జరిగుంటే.. అది జరిగి నాలుగేళ్లు అయిపోయింది. ఇన్నాళ్లు లేనిది ఇప్పుడే ఎందుకు వైరల్ అవుతోంది. పైగా ఇన్నాళ్లు హౌస్ లో కూడా పదే పదే ఆమె బ్రేకప్ విషయం హైలెట్ అయింది.

దీని వెనుక ఓటింగ్ స్ట్రాటడీ, సింపథీ కార్డ్ గేమ్ ఉందంటూ విమర్శలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అవే మాటలను నేరుగా రాహుల్ సిప్లిగంజ్ అన్నాడు. అయితే అతను నేరుగా ఎవరి పేరుని పెట్టలేదు. కానీ, ఆ పోస్ట్ మాత్రం రతికా రోజ్ కోసమే పెట్టాడు అంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయితే అసలు రాహుల్ సిప్లిగంజ్ ఏమన్నాడంటే.. “ఫేక్ సింపథీ గేమ్స్ ఎప్పటివరకు? జనాలు అందరూ తమ సొంత టాలెంట్ ని నిరూపించుకోవాలి అనుకుంటారు. కానీ, కొంతమంది మాత్రం వేరొకరి పేరు, టాలెంట్ మీద ఆధారపడతారు. దానిని ప్రజలే నిరూపిస్తారు. ఫేమ్ కోసం పేరుని అవసరానికంటే ఎక్కువగా వాడుకుంటున్నారు. ఆల్ ద బెస్ట్ టూ ది ఇన్నర్ పర్సన్.. పైసల్ తీసుకున్న టీమ్ కి కంగ్రాట్యులేషన్స్” అంటూ రాహుల్ సిప్లిగంజ్ రాసుకొచ్చాడు.

ఈ మాటలు రతికా కోసమే అని అంతా ఫిక్స్ అయిపోయారు. పైగా ఇన్నర్ పర్సన్ అనే పదాన్ని హైలెట్ చేస్తున్నారు. హౌస్ లో ఉంది కాబట్టి అలా అన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇన్నాళ్లు లేనివి ఇప్పుడు రాహుల్ తో దిగిన ఫొటోలు, రతికా బ్రేకప్ రీజన్స్ అంటూ ఇంటర్వ్యూలు అన్నీ ఒక్కసారిగా సోషల్ మీడియాలోకి వచ్చేశాయి. ఇదంతా రతికా పీఆర్ టీమ్ స్ట్రాటజీ అంటూ విమర్శలు ఉన్నాయి. రాహుల్ కామెంట్స్ లో చివర పైసల్ తీసుకున్న వాళ్లకి శుభాకాంక్షలు అని చెప్పాడు. అంటే అది పీఆర్ టీమ్ కే అంటూ ఫిక్స్ అయిపోయారు. మొత్తానికి వీళ్ల మధ్య ఏం ఉందో.. ఏం లేదో తెలియదు గానీ.. నెట్టింట రచ్చ మాత్రం గట్టిగానే జరుగుతోంది. మరి.. రాహుల్ సిప్లిగంజ్ పోస్ట్ ఎవరికోసం అని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments