యాత్ర-2 సినిమాపై ఫేక్ జీవో విడుదల చేసి రాక్షసానందం!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర-2 మూవీ శుక్రవారం విడుదలైంది. ఫస్ట్ షో నుంచి పాజిటీవ్ టాక్ తో యాత్ర-2 మూవీ దూసుకెళ్తోంది. ఇది నచ్చని ఎల్లో మీడియా ఫేక్ న్యూస్ లను క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర-2 మూవీ శుక్రవారం విడుదలైంది. ఫస్ట్ షో నుంచి పాజిటీవ్ టాక్ తో యాత్ర-2 మూవీ దూసుకెళ్తోంది. ఇది నచ్చని ఎల్లో మీడియా ఫేక్ న్యూస్ లను క్రియేట్ చేసి..సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో మరికొద్ది నెలల్లో ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఇలా ఎలక్షన్లకు సమయం దగ్గర పడే కొద్ది ప్రతిపక్ష టీడీపీ, ఎల్లో మీడియాలో బరితెగిస్తోన్నాయి. రాష్ట్ర ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విషయం చిమ్మడమే లక్ష్యంగా వీళ్లు పని చేస్తున్నారు. అంతేకాక అసత్య వార్తలను చక్కగా రాస్తూ ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో టీడీపీ సోషల్ మీడియా విభాగం రోజుకో రీతిలో వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతూ రాక్షసానందం పొందుతున్నాయి. అలా చేసే ప్రయత్నంలో వీరి వార్తలు ఫేక్ అని తేలడంతో..ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారు. తాజాగా యాత్ర-2 సినిమా విషయంలో అలానే ఒక ఫేక్ జీవోను క్రియేట్ చేసి వైరల్ చేశారు.

దివంగత నేత, ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవిత ఆధారంగా తెరకెక్కిన సినిమా యాత్ర-2. 2009 నుంచి 2019 మధ్యలో ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు, వైఎస్ జగన్ విషయంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఈ సినిమాల్లో కళ్లకు కట్టినట్లు చూపించారు. శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. చాలా మంది సినిమా చూస్తూ ఎమోషనలయ్యారు. ఇక సినిమాలో వచ్చే ప్రతి డైలాగ్ కి థియేటర్లలో విజిల్స్ పడ్డాయి. ఇక యాత్ర-2సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకి క్యూ కడుతున్నారు.

ఇది ఇలా ఉంటే.. ఇలా ప్రజలు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టడం ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకి ఏమాత్రం నచ్చలేదు. అందుకే వారి అనుచరులు, ఎల్లో మీడియా ఆ సినిమా పేరుతో  రాష్ట్ర ప్రభుత్వం బురదజల్లేందుకు కంకణం కట్టుకున్నారు. ఓ పేక్ జీవోను సృష్టించి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. యాత్ర-2 సినిమాను అంగన్ వాడీ కార్యకర్తలు, ఆశావర్కర్లు, వలంటీర్లు మొదలైన వారు తొలి రెండు రోజులు చూసేలా  జిల్లా కలెక్టర్లను ఆదేశిస్తున్నట్లు ఆ ఫేక్ జీవోలో పేర్కొన్నారు.

అదే విధంగా ప్రతి వాలంటీర్ తమ పరిధిలోని 10 మందిని సినిమాకు తీసుకురావాలని, అందుకోసం ఒక్కొక్కరి 10 టికెట్లు అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు అందులో చూపించారు.  అలానే రోజూ సినిమా వసూలు ఎంతో కూడా కలెక్టర్లే లెక్కించి నివేదించాలని ఈ నెల 7వ తేదీన విడుదల చేసినట్టున్న ఆ జీవోలో పొందుపరిచారు. అయితే దీనిని సృష్టించిన ఎల్లో సోషల్ మీడియా  ఓ విషయాన్ని మర్చి అండగా దొరికిపోయింది. ఆ ఉత్తర్వులు మాజీ సీఎస్ నీలం సాహ్ని విడుదల చేసినట్లు  చూపించారు. అయితే ప్రస్తుతం ఆ సర్వీసులో లేరన్న విషయం ఎల్లో సోషల్ మీడియ గమనించలేదు.

నీలం సాహ్ని రెండేళ్ల క్రితమే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవికి విరమణ చేసి.. ప్రస్తుతం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఉన్నారు. అయితే యాత్ర-2 సినిమాకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ విధమైన సాయమూ కోరలేదు. కేవలం సినిమాపై నెగిటీవ్ తీసుకొచ్చేందుకే ఎల్లో మీడియా ఈ కుట్రకు పాల్పడినట్లు పలువురు అభిప్రాయ పడుతున్నారు. అదే విషయం ఈ ఫేక్ వార్తతో నిజమైంది. మరి..ఇలా రాష్ట్ర ప్రభుత్వంపై ఫేక్ వార్తలను క్రియేట్ చేస్తూ రాక్షసానందం, శునకానందం పొందుతున్న వారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments